అది టిఆర్ఎస్, ఎసిబి జాయింట్ ఆపరేషన్: వర్ల ఫైర్
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనానికి కారణమైన ఓటుకు నోటు కేసులో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ), ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) జాయింట్ ఆపరేషన్ నిర్వహించాయని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం నేత వర్ల రామయ్య ఆరోపించారు.
తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి సంబంధించిన ఈ కేసుపై ఆయన బుధవారంనాడు స్పందించారు. ఈ వ్యవహారంలో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ వైఖరిని కూడా తప్పుబట్టారు. గవర్నర్ అన్ని విషయాల్లో విఫలమయ్యారని విమర్శించారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ భాష నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు తలదించుకునేలా ఉందని దుయ్యబట్టారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబున నాయుడు, ఏపీ మంత్రుల ఫోన్ ట్యాపింగ్‌పై ఆ రాష్ట్ర గుంటూరు వాసి కిలారి నరేంద్ర హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు చేశారు.
ఫోన్ ట్యాపింగ్‌కు బాధ్యులైన తెలంగాణ సీఎం కేసీఆర్, డీజీపీ, తెలంగాణ అధికారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. హెచ్‌ఆర్సీ ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది.












Click it and Unblock the Notifications