• search
 • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఏపీ రాజకీయాల్లో పెద్ద కుదుపు రాబోతుందన్న వర్ల సంచలనం: అవును నిజమే అని వైసీపీ నేతల సెటైర్లు

|

ఏపీ రాజకీయాల్లో పెద్ద కుదుపు రాబోతుందని టీడీపీ నేత వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.రానున్న ఆరునెలల్లో ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించబోతున్నాయని ఆయన అన్నారు. నీలం సాహ్నిని ఏపీ సీఎస్ గా తీసుకురావడమే అందుకు కారణమని వర్ల రామయ్య పేర్కొన్నారు. అంతేకాదు వర్ల రామయ్య త్వరలో ఐఏఎస్ శ్రీలక్ష్మి కూడా ఏపీకి రాబోతున్నారని చెప్పారు. వర్ల రామయ్య ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.అయితే పెద్ద కుదుపు ఆరునెలల తర్వాత కాదు ఇప్పుడే వచ్చింది అంటున్నారు వైసీపీ నేతలు.

6 నెలలు చిప్పకూడు తిన్న వ్యక్తి సీఎం అని జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు

6 నెలలు చిప్పకూడు తిన్న వ్యక్తి సీఎం అని జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు

11 చార్జిషీట్లు ఎదుర్కొంటున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు వర్ల రామయ్య. 16 నెలలు చంచల్ గూడా జైల్లో ఉన్న, చిప్పకూడు తిన్న వ్యక్తి మన ముఖ్యమంత్రి అంటూ చెప్పిన ఆయన మన ముఖ్యమంత్రి కి ఒక ఘన చరిత్ర ఉంది అంటూ ఎద్దేవా చేశారు. అవినీతి ఆరోపణలున్న అధికారులను తీసుకువచ్చి రాష్ట్ర పాలనలో భాగస్వామ్యం చేయడం సీఎం జగన్మోహన్ రెడ్డికే సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు.

  కేసుల మాఫీ కోసమే ఆ నలుగురు BJP లో చేరారు || Varla Ramaiah Reacts On TDP MPs || Oneindia Telugu
  తండ్రి పేరు అడ్డు పెట్టుకుని అక్రమార్జన చేశారని విమర్శలు

  తండ్రి పేరు అడ్డు పెట్టుకుని అక్రమార్జన చేశారని విమర్శలు

  అంతేకాదు తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని అడ్డుపెట్టుకొని లక్షల కోట్లు దండుకుని, చట్టానికి చిక్కి, అరెస్ట్ కాబడ్డాడు అని సీఎం జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు వర్ల రామయ్య.

  తప్పులన్నీ జగన్ దగ్గర పెట్టుకుని ఏం చేద్దాం అనుకుంటున్నారు అని ప్రశ్నించిన వర్ల రామయ్య, ప్రజలు చంద్రబాబుని గెలిపించిన కుండా పొరపాటు చేశారని వ్యాఖ్యానించారు. ఇక అంతే కాదు‘మీ అందరిని ఒక ప్రశ్న అడుగుతున్నా.. మన చీఫ్ మినిస్టర్ ఎవరు ఈరోజున? అని ప్రశ్నించిన ఆయన జనాలు పేరు చెప్పడానికి కూడా ఇష్టపడలేదు అని పేర్కొంటూ మిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ ఆన్ టుడే అని వ్యాఖ్యానించారు. ఇక ఆయన గురించి రెండు మాటలు చెప్పండని ఎవరైనా అడిగితే అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లారని చెప్తారని పేర్కొన్నారు.

  యువనేత దేవినేని అవినాష్ జంప్ పెద్ద కుదుపే

  యువనేత దేవినేని అవినాష్ జంప్ పెద్ద కుదుపే

  చంద్రబాబు నాయుడు ఇసుక దీక్షలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వర్ల రామయ్య ఏపీ రాజకీయాల్లో ఆరునెలల్లో పెద్ద కుదుపు వస్తుందని చెప్పారు. అవును వర్ల రామయ్య చెప్పింది నిజమే.. పెద్ద కుదుపు ఆరు నెలల తర్వాత కాదు ఇప్పుడే వచ్చిందని అంటున్నారు వైసీపీ నేతలు . టీడీపీ రాజకీయాల్లో చంద్రబాబు ఇసుక దీక్ష నాడే పెద్ద కుదుపు వచ్చింది. యువ నేత దేవినేని అవినాష్ టీడీపీకి రాజీనామా చేసి వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు.టీడీపీలో ఎంత కష్టపడి పని చేసినా గుర్తింపు లేదని, అసలు ప్రాధాన్యత లేకుండా పార్టీలో ఉండలేకపోతున్నాని రాజీనామా చేసిన ఆయన జగన్ సమక్షంలో వైసీపీ లో చేరారు.

  వల్లభనేని వంశీమోహన్ వ్యాఖ్యలు .. పెద్ద కుదుపే అన్న వైసీపీ

  వల్లభనేని వంశీమోహన్ వ్యాఖ్యలు .. పెద్ద కుదుపే అన్న వైసీపీ

  ఇక రాజీనామా చేసి ఇన్ని రోజుల పాటు సైలెంట్ గా ఉన్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ చంద్రబాబు టార్గెట్ గా విమర్శనాస్త్రాలు సంధించారు. అటు పవన్ కళ్యాణ్ కు పలు ప్రశ్నలు సంధించారు. ఏపీ సీఎం పాలనకు కితాబిచ్చారు . ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వకుండా ఇలా ఆందోళనలు చేసి రాజకీయం చేస్తే వచ్చే టర్మ్ లో కూడా ప్రతిపక్షంలోనే కూర్చోవలసి వస్తుందని ఆయన ఘాటుగా విమర్శలు గుప్పించారు. ఇక ఇదంతా ప్రస్తుతం వర్ల రామయ్య చెప్తున్న పెద్ద కుదుపే అని వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు .

  English summary
  There are going to be many changes in AP politics in the next six months," Varla ramaiah said. Varla Ramaiah stated that the reason for bringing Neelam Sahni as AP CS. Also, Varla Ramaiah has said that IAS Srilakshmi is also coming to AP soon. this is going to change AP Politics. Varla has made a serious statement on AP CM Jaganmohan Reddy. ycp leaders satires on varla ramaiah comments because of latest developments in politics.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X