వైసీపీకి బిగ్‌షాక్.. వాసిరెడ్డి పద్మ రాజీనామా
సార్వత్రిక ఎన్నికల ముందు అధికార వైసీపీకి గట్టి షాక్ తగలింది. మహిళ కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తన రాజీనామా లేఖను సీఎం జగన్‌కు పంపారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశించి దక్కకపోవడం వల్లే వాసిరెడ్డి తన పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. రాబోవు ఎన్నికల్లో తనకు గాని, తన భర్తకు గాని టికెట్ కేటాయించాలని సీఎం జగన్‌ను వాసిరెడ్డి పద్మ కోరారు.
దీనిపై సీఎం జగన్ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో మనస్థాపం చెందిన ఆమె మహిళ కమిషన్ చైర్ పర్సన్ పదవి నుంచి తప్పుకున్నారు. అయితే పార్టీలో సాధారణ కార్యకర్తగా కొనసాగుతానని ఆమె స్పష్టం చేశారు. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన వాసిరెడ్డి, ఆ పార్టీలో అధికార ప్రతినిధిగా పని చేశారు.

అనంతరం చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో ఆమె జగన్ స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో చేరారు. 2019లో పార్టీ అధికారంలోకి రావడంతోనే వాసిరెడ్డి పద్మకు జగన్ కీలక పదవి అప్పగించారు. ఆంధ్రప్రదేశ్ మహిళ చైర్ పర్సన్ పదవిని ఆమెకు కేటాయించారు. జగ్గయ్యపేట ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ వాసిరెడ్డి పద్మ ,అసంతృప్తిని వ్యక్తం చేస్తూ..తనకిచ్చిన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.












Click it and Unblock the Notifications