టిడిపిలోకి వీరశివా, జగన్‌పై ఫైర్: ఉమ్మారెడ్డి అసహనం

సీమాంధ్రను సింగపూర్ చేసే సత్తా టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకే ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో టిడిపి విజయపతాకం ఎగురవేయడానికి తన శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డిపై రాష్ట్ర విభజకు ప్రధాన కారకుడు అన్నారు.
కాగా, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎలమంచిలి రవి కూడా టిడిపిలో చేరే అవకాశం ఉందంటున్నారు. ఇదే అంశంపై బుధవారం సాయంత్రం అనుచరులతో రవి మంతనాలు జరిపారట. టిడిపిలో చేరాల్సిందిగా రవికి ఎంపీ సుజనా చౌదరి నుంచి ఫోన్ వచ్చిందని అంటున్నారు.
జగన్‌పై ఉమ్మారెడ్డి అసంతృప్తి
వైయస్ జగన్మోహన్ రెడ్డి తీరుపై కేంద్ర మాజీ మంత్రి ఆ పార్టీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. తెనాలి అసెంబ్లీ సీటును తన అల్లుడికి ఇవ్వకపోవడంపై ఆయన మనస్థాపం చెందినట్లు సమాచారం. కొత్తగా వచ్చిన వ్యక్త్జికి సీటు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలియవచ్చింది.
పార్టీ ఆఫీసులో సేవలు, కీలక సూచనలు చేసినా పట్టించుకోకపోవడంపై ఉమ్మారెడ్డి మనస్థాపం చెందారు. వారం రోజులుగా ఇంటికే పరిమితమైన ఉమ్మారెడ్డికి జగన్ కుటుంబ సభ్యులు, వైవి సుబ్బారెడ్డి ఫోన్ చేసినా స్పందించనట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications