హైదరాబాద్-విజయవాడ రాకపోకలకు బ్రేక్: ఇక ఇలా...!!
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. కొన్నిచోట్ల ప్రధాన రహదారులు దెబ్బ తిన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల రైల్వే ట్రాక్ లు దెబ్బ తిన్నాయి. దీంతో రైళ్లను రద్దు చేసారు. మరి కొన్ని రైళ్లను దారి మళ్లించారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వరద నీరు పొటెత్తడంతో కోదాడ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో, రాక పోకలను నియంత్రిస్తున్నారు.
వరద నీరు
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వరద నీరు పొటెత్తడంతో కోదాడ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. నందిగామ వద్ద వాగు పొంగడంతో హైవే పైకి వరదనీరు చేరింది. గంటల కొద్ది వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వచ్చే వాహనాలను ఖమ్మం వైపుగా మళ్లించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఐతవరం అంబారుపేట వద్ద జాతీయ రహదారిపైకి భారీగా చేరిన వరద నీరు చేరింది. మున్నేరు, కట్టలేరు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.

రాకపోకలకు బ్రేక్
జగ్గయ్యపేట వద్ద రోడ్డు బ్లాక్ కావడంతో హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లేందుకు నార్కట్‌పల్లి నుంచి వయా మిర్యాలగూడ, గుంటూరు మీదుగా విజయవాడకు వాహనాలను మళ్లించారు. వాహనదారులు నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యాన్ని చేరుకోవాలని పోలీసులు సూచించారు. రోడ్డుప పక్కన గ్రామాల ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు పాటించాలని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.పెనుగంచిప్రోలు వద్ద హైవేపై ఉద్ధృతంగా వాగులు ప్రవహిస్తున్నాయి.
దారి మళ్లింపు
వాగుల ఉద్ధృతి వల్ల నెమ్మదిగా సాగుతున్న వాహనాల రాకపోకలు ముందుకు సాగుతున్నాయి. హదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలు నార్కట్‌పల్లి - అద్దంకి వైపు మళ్లింపు చేపట్టారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలు ఖమ్మం వైపు ముందుకు కదులుతున్నాయి. కోదాడ-రామాపురం చెక్‌పోస్ట్ వద్ద నెమ్మదిగా వాహనాలు అనుమతిస్తున్నారు. కోదాడ వద్ద హైవేపై ఒక్కవైపు మాత్రమే వాహనాలకు అనుమతి ఉండటంతో...అత్యవసరమైన ప్రయాణీకులు మాత్రమే ప్రయణాలకు ముందుకు రావాలని అధికారులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications