వెలిగొండ ప్రాజెక్ట్ పై ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు మంత్రి నిమ్మల రామానాయుడు శుభవార్త!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప, జిల్లాల ప్రజలకు, రైతులకు ఏపీ నీటిపారుదల శాఖా మంత్రి డా. నిమ్మల రామానాయుడు శుభవార్త చెప్పారు. త్వరలోనే ఈ ప్రాంత రైతుల సాగు నీరు, తాగు నీటి సమస్యలకు పరిష్కారం చూపించాబోతున్నామని ఆయన అసెంబ్లీ వేదికగా వెల్లడించారు.

పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ఈ నెలలోనే నీరు

కరువు, ఫ్లోరైడ్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజలకు పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ఈ నెలలోనే నీరు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని జలవనరులశాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలలో వెలిగొండ ప్రాజెక్ట్ పనులను పూర్తి చేసి ప్రారంభించుకోవటానికి సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. దాదాపు మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ ప్రాజెక్టు కలను కూటమి ప్రభుత్వం సాకారం చేస్తోందని చెప్పారు.

veligonda project Good news to prakasham nellore kadapa Veligonda Project inaugurate this month

ఇదో చారిత్రక ఘట్టం అన్న మంత్రి నిమ్మల

1996లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన ప్రాజెక్టును ఇప్పుడు అదే ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ప్రారంభించి నీరు అందించబోతుండటం చారిత్రక ఘట్టమని మంత్రి నిమ్మల రామానాయుడు అభివర్ణించారు. 2024లో జలవనరుల శాఖ సమీక్షలో 2026 ఆగస్టు నాటికి పూర్తి చేయాలని చంద్రబాబు లక్ష్యం నిర్దేశించగా, గత రెండేళ్లుగా పనులు వేగవంతం చేశారు.

తమ హయాంలో చేసిన పనులను వివరించిన మంత్రి

వెలిగొండ హెడ్ రెగ్యులేటర్ పనులు, అప్రోచ్ ఛానల్‌లో 80 వేల మెట్రిక్ టన్నుల మట్టి తొలగింపు పూర్తయ్యాయని నిమ్మల వెల్లడించారు. టన్నెల్-2లో 6,907 మీటర్ల లైనింగ్ పూర్తి చేసి మిగిలిన 81 మీటర్లను కొన్ని రోజుల్లో పూర్తి చేస్తామని తెలిపారు. నిలిచిపోయిన టన్నెల్ బోరింగ్ మిషన్ (TBM) తొలగింపు కూడా దాదాపు పూర్తయింది. 21 కిలోమీటర్ల ఫీడర్ కెనాల్ పనులకు రూ.460 కోట్లు మంజూరు చేసి వేగంగా కొనసాగిస్తున్నారన్నారు.

పంటల బీమాపై రైతులకు మంత్రి అచ్చెన్నాయుడు పిలుపు!
పంటల బీమాపై రైతులకు మంత్రి అచ్చెన్నాయుడు పిలుపు!

అసెంబ్లీ వేదికగా మూడు జిల్లాలకు మంత్రి శుభవార్త

వెలిగొండ ప్రాజెక్ట్ కోసం భూములు ఇచ్చిన నిర్వాసితుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ ఇప్పటికే వేలాది మందికి రూ.500 కోట్లకు పైగా చెల్లించారు. ఏడు కాలనీల్లో నాలుగు పూర్తయ్యాయన్నారు. గత రెండేళ్లలో ప్రాజెక్టుపై సుమారు రూ.3,000 కోట్లు ఖర్చు చేశామని ఆయన వెల్లడించారు. ఈ నెలలోనే నీరు అందించాలన్న లక్ష్యంతో పనులు చివరి దశకు చేరుకున్నాయని మంత్రి అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు. త్వరలో ఈ ప్రాజెక్ట్ ప్రారంభిస్తామని శుభవార్త చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
q