కరణం వర్గీయుల హత్య కేసులో నిందితుల అరెస్టు: అంతా ఎమ్మెల్యే అనుచరులే!?
అద్దంకి నియోజకవర్గంలోని బల్లికురవ మండలం వేమవరంలో చోటు చేసుకున్న జంట హత్యల కేసులో పోలీసులు శుక్రవారం నాడు 14మందిని అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తుండగా.. పట్టుబడ్డ నిందితులంతా
ఒంగోలు: అద్దంకి నియోజకవర్గంలోని బల్లికురవ మండలం వేమవరంలో చోటు చేసుకున్న జంట హత్యల కేసులో పోలీసులు శుక్రవారం నాడు 14మందిని అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తుండగా.. పట్టుబడ్డ నిందితులంతా ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అనుచరులే అని తెలుస్తోంది.
పోలీసుల కథనం ప్రకారం.. మే 19వ తేదీ రాత్రి వేమవరం గ్రామంలో గోరంట్ల అంజయ్య, వేగినేని రామకోటేశ్వరరావు అనే ఇద్దరు హత్యకు గురవగా.. వేగినేని ముత్యాలరావు, గోరంట్ల వెంకటేశ్వర్లు, వేగినేని వీరరాఘవులు తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రస్తుతం పోలీసులు అరెస్టు చేసినవారిలో ప్రధాన నిందితుడు మాలెంపాటి వెంకటేశ్వర్లుపై గతంలోను హత్య కేసు ఉంది. 1989లో సాంబయ్యను హత్య చేసిన కేసులో అతను నిందితుడిగా ఉన్నాడు.

వీరే నిందితులు:
మాలెంపాటి వెంకటేశ్వర్లు, గొట్టిపాటి మారుతీబాబు అలియాస్ మారుతీ, మాలెంపాటి లక్ష్మీనారాయణ అలియాస్ చిన్నోడు, గొట్టిపాటి వెంకటేశ్వర్లు అలియాస్ సొసైటీ, గొట్టిపాటి వీరాంజనేయులు, గొట్టిపాటి శివన్నారాయణ, గొట్టిపాటి బ్రహ్మయ్య, శాఖమూరి సీతయ్య, శాఖమూరి రంగారావు, శాఖమూరి కాంతారావు, గొట్టిపాటి శ్రీనివాసరావు, గొట్టిపాటి రమేష్, గురజాల రాంబాబు, గురజాల రామాంజనేయులు కేసులో నిందితులుగా ఉన్నారు. వీరిని శుక్రవారం నాడు పోలీసులు అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు.

ఎక్కడ అరెస్టు చేశారు?:
కేసులో 8మంది నిందితులను అద్దంకి వ్యవసాయ మార్కెట్ కమిటీ సమీపంలోను, మిగతా ఆరుగురిని చినకొత్తపల్లి వద్ద పోలీసులు అరెస్టు చేశారు. దాడిలో నిందితులు ఉపయోగించిన కత్తులు, కర్రలు, కారంపొడి డబ్బా, దాడి అనంతరం నిందితులను తరలించేందుకు ఉపయోగించిన కారు, మూడు మోటారు సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కక్షలు ప్రతీకారాలు వద్దన్న పోలీసులు:
ఇకనైనా గ్రామాల్లో దాడులు, ప్రతిదాడులు మానుకోవాలని ఐజీ సంజయ్ సూచించారు. నేరాలు చేసినవారిని ఏమాత్రం సహించేది లేదని వారి పట్ల కఠినంగా వ్యవహారిస్తామని అన్నారు. వేమవరం జంట హత్యల కేసుకు గతంలో శివాలయం, రామాలయం మైనింగ్ విషయాలకు సంబంధమున్నట్లుగా పాత ఘర్షణల కారణంగా తెలుస్తోందని పేర్కొన్నారు. స్పీడ్ బ్రేకర్ల సమస్య కూడా ఇందుకు కారణంగా ఉందని చెప్పుకొచ్చారు.

పోలీస్ నెట్ వర్క్ ఫెయిల్:
వేమవరం హత్యల ఘటనలో పోలీస్ నెట్ వర్క్ విఫలమైందని ఐజీ తెలిపారు. బల్లికురవ ఎస్ఐ ప్రొబేషనరీ ఎస్ఐ కావడం వలన సమాచార సేకరణలో కొంత లోపం ఏర్పడిందన్నారు. కొత్తగా వచ్చిన ఎస్ఐలు పోలీస్ స్టేఫన్లలో విధులు సరిగా నిర్వర్తిస్తేనే భవిష్యత్తులో మంచి పేరు తెచ్చుకోగలరని చెప్పుకొచ్చారు. ప్రొబేషనరీ ఎస్ఐ కావడంతో అతనిని మందలించడం జరిగిందని, అనుభవజ్ఞులైన సీనియర్ పోలీస్ అధికారు వద్ద ఆయనకు శిక్ష ఇప్పిస్తామని ఐజీ చెప్పారు. స్పెషల్ బ్రాంచ్ నిఘా వ్యవస్థ కూడా ఈ విషయంలో సక్రమంగా పనిచేయలేదని స్పష్టం చేశారు.

నిష్పక్షపాతంగా విచారణ:
వేమవరం జంట హత్యల కేసులో నిష్పక్షపాతంగా వ్యవహరించినట్లు ఎస్పీ త్రివిక్రమ వర్మ తెలిపారు. ప్రాథమిక సమాచారం అందిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితులుగా 15మందితో పాటు మరికొందరిని పేర్కొన్నట్లు తెలిపారు. ఎస్పీ స్వయంగా దర్యాప్తు చేపట్టడం వల్ల బాధితులనుంచి సక్రమమైన సమాచారం వచ్చిందన్నారు.
విచారణలో భాగంగా తొలుత నమోదు చేసిన ముగ్గురి పేర్లకు ఈ కేసుకు సంబంధం లేదని తేలడంతో.. వారి పేర్లను తొలగించినట్లు ఐజీ వెల్లడించారు. పేర్లు తొలగించినవారిలో మాలెంపాటి అనిల్, మాలెంపాటి నరేష్ ఉన్నారని తెలిపారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications