హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎయిరిండియాపై వెంకయ్యకు కోపమొచ్చింది: ఏం చేశారో తెలుసా?

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రభుత్వ విమానయాన సంస్ధ ఎయిర్ ఇండియా కస్టమర్లనే కాదు కేంద్ర మంత్రులను కూడా ముప్పుతిప్పలు పెడుతోంది. ఓ అత్యవసర పని నిమిత్తం కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మంగళవారం హైదరాబాద్‌కు బయల్దేరారు. విమానం కోసం గంటంపావు సేపు ఎయిర్ పోర్టులో ఎదురు చూసిన ఆయన.. ఎంతకీ విమానం రాకపోవడంతో ఇంటికి తిరిగి వెళ్లిపోయారు.

అనంతరం తన విలువైన కాలాన్ని వృథా చేసిన ఎయిర్ ఇండియా నిర్వహణ తీరుపై ట్విట్టర్‌లో మండిపడ్డారు. అనంతరం వివరణ ఇవ్వాలని తనకు ఎదురనైన చేదు అనుభవాన్ని ట్విట్టర్‌లో పంచుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఓ కార్యక్రమం నిమిత్తం వెంకయ్య మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరేందుకు సిద్దమయ్యారు.

ఈ మేరకు ఎయిర్ ఇండియా 544 విమానంలో ఆయనకు సీటు కూడా ఖరారైంది. మధ్యాహ్నం 1:15 గంటలకు విమానం బయలుదేరాల్సి ఉండగా, ఆయన 12:20కే ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే విమానం బయర్దేరాల్సిన కొద్ది నిమిషాల ముందు 'పైలట్ ఇంకా రాలేదని, మరి కొద్దిసేపు వేచిచూడాలని' అధికారులు ఆయనకు తెలియజేశారు.

venkaiah naidu demands air india explaination on flight delay

దీంతో ఆయన 1:45 వరకు ఎదురు చూసినా ఫలితం లేకపోవడంతో తిరిగి తన ఇంటికి వెళ్లిపోయారు. ఇంటికి చేరుకున్న అనంతరం ఎయిర్ ఇండియా నిర్వాకాన్ని వివరిస్తూ వరుస ట్వీట్లు చేశారు. సర్వీసు ఎందుకు ఆలస్యమైందో చెప్పాలని ఎయిర్ ఇండియాను డిమాండ్ చేశారు.

విమానయాన సంస్ధల్లో ప్రస్తుతం ఉన్న పోటీకి అనుగుణంగా మారడంతోపాటు పారదర్శకత, జవాబుతారీతనం పెంపొందించుకోవాలని ఎయిర్ ఇండియా విమానయాన సంస్థకు మంత్రి వెంకయ్య నాయుడు హితవుపలికారు.

కాగా, వెంకయ్య వరుస ట్వీట్లకు ఎయిర్ ఇండియా కూడా ట్విట్టర్‌లో స్పందించింది. విమానం ఆలస్యం అవడం వల్ల మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని పేర్కొంది. విమాన పైలెట్ ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కు పోడవం వల్లే ఇదంతా జరిగిందని, దీనిపై విచారణకు ఆదేశించామని పేర్కొంది.

English summary
central minister venkaiah naidu demands air india explaination on flight delay.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X