సఖ్యతతో వెళ్లండి: ఏపీ-టీలకు వెంకయ్య, నిత్యం బాబు వెంటే బాలకృష్ణ
అమరావతి/న్యూఢిల్లీ: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు రెండు తెలుగు రాష్ట్రాలకు శుభాకాంక్షలు పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
రెండు రాష్ట్రాలు సఖ్యతతో వ్యవహరించి ముందుకు వెళ్లలని సూచించారు. అంతేకాక ఇరు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీపడుతూ ముందుకు వెళ్లాలని హితవు పలికారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సాయం అందిస్తుందన్నారు. ఇరు రాష్ట్రాల సీఎంలు రాజకీయాలు వదిలి అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు.
చంద్రబాబు వెంటే బాలకృష్ణ

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును వియ్యంకుడు, హిందుపూరం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఉదయం నుంచి ఒక్క క్షణమైనా వదిలి లేరు. చంద్రబాబు మాట్లాడినట్లుగా వచ్చిన టేపులు ఆదివారం రాత్రి బహిర్గతం అయిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఉదయం నుండి బాబు వెంటే బాలకృష్ణ ఉన్నారు. బాబు కొంత మనస్థాపంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. కాగా, గుంటూరు సమీపంలోని మంగళగిరిలో జరుగుతున్న మహా సంకల్ప వేదిక వద్దకు చంద్రబాబుతో పాటు బాలకృష్ణ, నారా లోకేష్ చేరుకున్నారు.












Click it and Unblock the Notifications