టి బిల్లు నిలబడదు, చిరంజీవిది నిజం.. భేష్: వెంకయ్య

Venkaiah Naidu
విశాఖపట్నం: యూపిఏ ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ బిల్లు న్యాయస్థానం ముందు నిలబడదని బిజెపి సీనియర్ నేత వెంకయ్యనాయుడు శనివారం విశాఖలో 'మోడీ ఫర్ పీఎం' ప్రచార సభలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక తెలంగాణ బిల్లుకు రాజ్యాంగ సవరణ చేస్తుందన్నారు. మూడు నెలల తర్వాత పదవి నుంచి దిగిపోయే ప్రధాని తన నివాసం కోసం ఇప్పుడే ప్రణాళిక వేసుకుంటున్నారన్నారు.

ఇన్ని దశాబ్దాలు కలిసి ఉన్న తెలుగుజాతిని విడదీసేటప్పుడు కొత్త రాజధాని ఎక్కడ పెట్టాలో ఎందుకు ముందుగా నిర్ణయించలేదన్నారు. విభజన బిల్లును టేబుల్ ఐటమ్‌గా పెట్టడంలోనే కాంగ్రెస్‌కు దీనిపైగల శ్రద్ధ ఏమిటో అర్థమవుతుందన్నారు. విభజనపై తమతో చర్చలు జరపలేదని ఆ పార్టీ ఎంపీలు, మంత్రులే చెబుతున్నారని, కేంద్రమంత్రి చిరంజీవి రాజ్యసభలో ఉన్నది ఉన్నట్టు మాట్లాడేశారన్నారు. చిరు మాట్లాడిన తీరు హర్షణీయమన్నారు.

మరో కేంద్ర మంత్రి పురందేశ్వరి ఇంటికి వచ్చి.. విభజన వద్దని ఎంత చెప్పినా వారు వినలేదని, కనీసం పోలవరం ముంపు గ్రామాలనైనా సీమాంధ్రలో చేర్చేలా చూడాలని కోరినట్లు చెప్పారు. విభజనను వ్యతిరేకిస్తూ అనేకమంది రాజీనామా చేసినట్లు ప్రకటించినా అవన్నీ అవాస్తవాలని, ఒక్క టిడిపి ఎంపి హరికృష్ణే నిజాయతీగా రాజీనామా చేశారన్నారు. మీ నాయకుడెవరని అడిగితే చెప్పడానికి కాంగ్రెస్‌వారు సిగ్గు పడుతున్నారని ఎద్దేవా చేశారు.

మ్యాచ్ ముగిశాక కెప్టెన్‌ను ప్రకటిస్తామనడం ఎలాంటి ఆటతీరో గమనించాలన్నారు. పొత్తులనేవి వన్ సైడ్ లవ్ కాదని, రెండు వర్గాల అంగీకారంతోనే సాధ్యమన్నారు. తాము వచ్చాక తెలంగాణ బిల్లులో సవరణలు చేస్తామన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చాక సీమాంధ్రను స్వర్ణాంధ్ర చేస్తామన్నారు. హైదరాబాదులో 12 శాతం ఉన్న మైనార్టీలే రాజకీయాల్ని శాసిస్తున్న నేపథ్యంలో 28 శాతం ఉన్న సీమాంధ్రులు భయపడాల్సిన అవసరం లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+