మన్మోహన్‌ను మౌని ముని అన్నారు, ఇప్పుడేమైంది: వెంకయ్యపై విహెచ్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు పదేళ్లపాటు ప్రత్యేక హోదా సాధించి తీరుతామని హామీ ఇచ్చిన బిజెపి నేతలు ముఖ్యంగా కేంద్ర పట్టణాభివృధ్ది మంత్రి ఎం వెంకయ్యనాయుడును ఆ హామీ నెరవేర్చేంతవరకూ తమ ప్రాంతంలో అడుగుపెట్టనీయవద్దని రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావుప్రజలకు పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా సాధించే విషయంలోముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రజలను మాయమాటలతో మభ్యపెడుతున్నారని ఆయన ఆరోపించారు.
విభజన బిల్లుపై రాజ్యసభలో చర్చ జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను తాను తప్పించి మరొకరు పరిరక్షించలేరన్నట్లు వెంకయ్య వ్యవహరించారని ఆయన విమర్శించారు. తాము అధికారంలోకొస్తే పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇచ్చి తీరతామన్న వెంకయ్య ప్రకటన ఏమైందని ఆయన ప్రశ్నించారు. మన్మోహన్‌సింగ్ వౌనముని అని విమర్శించిన వెంకయ్య ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో రెండు నాల్కల ధోరణిని ప్రదర్శిస్తున్నారని శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

తన వైఫల్యానికి కూడా కాంగ్రెస్ పార్టీని, యుపీఏ పాలనను తప్పుపట్టటం వెంకయ్యకు అలవాటై పోయిందని విహెచ్ విమర్శించారు. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీల పోస్టల్‌స్టాంపుల ముద్రణ నిలుపుచేయాలన్న కేంద్ర నిర్ణయాన్ని ఆయన తప్పుపట్టారు.
దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహానాయకుల తపాలాబిళ్లలను నిలుపుచేసినంత మాత్రాన ప్రజల మనసులు చరిత్ర నుంచి వారిని తొలగించటం సాధ్యపడదన్న నిజాన్ని మోదీ ప్రభుత్వం గ్రహించాలని ఆయన కోరారు. తెలంగాణలో చిరకాలంగా స్థిరపడిన 24 కులాలను బిసిల జాబితా నుంచి తొలగించాలన్న తెరాస ప్రభుత్వ నిర్ణయాన్ని విహెచ్ తప్పుపట్టారు.












Click it and Unblock the Notifications