కిరణ్ హీరోయిజమేమైంది, రేపు చూస్తా: విహెచ్, జగన్‌పై

కిరణ్ కిరికిరి ముఖ్యమంత్రి అన్నారు. ముఖ్యమంత్రి హీరోయిజం సొంత జిల్లా చిత్తూరులో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బయటపడిందన్నారు. అక్కడ పార్టీ చావుదెబ్బ తిన్నదన్నారు. తెలంగాణ ఇవ్వడంలో సోనియా కృషిని పది జిల్లాల్లో గడప గడపకు వివరించేందుకు రథయాత్ర చేపట్టానని, ప్రతి తెలంగాణవాది కాంగ్రెసును ఆదరించాలని కోరారు. తెలంగాణ వస్తే జగన్ లోటస్ ఉండదు, పాండ్ ఉండదన్నారు. ఆయన చంచల్ గూడ జైలులోనే ఉంటారన్నారు. కాగా, విహెచ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని అదే పనిగా విమర్శిస్తుండటంతో ఏఐసిసి కార్యదర్శి రామచందర్ కుంతియా ఆపాలని సంజ్ఞ చేయడంతో, రేపు చూసుకుంటానని ప్రకటించి ముగించారు.
తెలంగాణ ఆపే దమ్ము ఎవరికీ లేదు
తెలంగాణను ఆపే దమ్ము ఎవరికీ లేదని ఎఐసిసి కార్యదర్శి రామచందర్ కుంతియా అన్నారు. రాష్ట్రం విడిపోతే నదీజలాలు, రాజధాని, రెవెన్యూ తదితర సమస్యలు రాకుండా ఆంటోని కమిటీ పరిష్కారం సూచించిందన్నారు.
అరవయ్యేళ్ల తెలంగాణ ప్రజల కలను సోనియా సాకారం చేశారని శ్రీధర్ బాబు అన్నారు. సిడబ్ల్యుసి నిర్ణయాన్ని అమలు చేయకుండా కొందరు అడ్డుపడుతున్నారని, తెలంగాణ మంత్రులకు అవమానం జరిగితే ఇక్కడి ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు. తెలంగాణ సాధించి పెట్టిన కాంగ్రెసును గెలిపించి అండగా నిలువాలన్నారు.












Click it and Unblock the Notifications