ఆచూకీ లేని మురికి కాల్వలో పడిన చిన్నారి: రెండ్రోజులుగా సాగుతున్న గాలింపు(ఫొటోలు)
విశాఖపట్నం: నగరంలోని డాక్టర్ కృష్ణా కళాశాల పక్కన ఉన్న మురికి కాలువలో ప్రమాదవశాత్తూ పడిపోయిన అదితి(6) అనే చిన్నారి ఆచూకీ ఇంకా తెలియలేదు. బాలిక ఆచూకీ కోసం గురువారం సాయంత్రం నుంచి సహాయక చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది.
పోలీసులు తెలిపిన ప్రకారం.. సీతమ్మధారకు చెందిన సీహెచ్ అదితి కృష్ణా కళాశాల దగ్గర ఉన్న ఐవోఎస్ ట్యూషన్ సెంటర్‌కు రోజులాగే గురువారం సాయంత్రం వెళ్లింది. ట్యూషన్ ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లడానికి కాలువ పక్కన ఆపిన కారును ఎక్కడానికి ప్రయత్నించిన అదితి కాలు జారి మురికి కాలువలో పడిపోయింది.

ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పాపను రక్షించడానికి ప్రయత్నించి.. కాలువ వెంబడి పరిగెత్తినా ప్రయోజనం లేకపోయింది. కొంతదూరం వెళ్లాక ఆ కాలువ పెద్ద కాలువలో కలిసింది.

అధికారులు జేసీబీని తెప్పించి కాలువపై ఉన్న స్లాబులను తొలగించి వెతికినా అదితి ఆచూకీ దొరక లేదు. తల్లిదండ్రులు బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుండటంతో నానమ్మ వద్ద ఉండి అదితి స్థానిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుకుంటోంది.

డీసీపీ త్రివిక్రమవర్మ, పోలీస్ కమిషనర్ అమిత్‌గార్గ్‌తోపాటు పలువురు పోలీసుల, జీవీఎంసీ అధికారులు సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. హెలికాప్టర్ సాయంతోనూ గాలింపు చేపట్టారు. శనివారం కూడా చిన్నారి కోసం కాలువ వెళ్లే అన్ని మార్గాల్లో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. కాగా, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన జివిఎంసి బిల్డింగ్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ , ఏఈని సస్పెండ్ చేయాలని మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశించారు.












Click it and Unblock the Notifications