తెనాలిలో పోలీస్ లాఠీఛార్జ్ వీడియో వైరల్.. ఒకరు సస్పెండ్ !

ఖాకీ డ్రస్‌ ఉంది కదా అని ఇష్టానుసారంగా వ్యవహరిస్తాం.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటామంటే.. ఇప్పుడు ఆ పప్పులు ఉడికే రోజులు పోయాయి. అధికారం అండతో ఏం చేసినా చెల్లుతుందనుకున్న తెనాలి పోలీసులకు షాక్ తగిలింది. ఒక కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురు వ్యక్తులను నడిరోడ్డుపైకి తీసుకొచ్చి అమానుషంగా లాఠీతో కొట్టిన ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌అయ్యింది. దీనిపై స్పందించిన పోలీసు శాఖలోని ఉన్నతాధికారులు సదరు పోలీసులపై యాక్షన్ తీసుకున్నట్టు సమాచారం.

ఇంతకీ ఏం జరిగిందంటే..

గంజాయి మత్తులో జాన్‌ విక్టర్‌, రాకేష్‌, బాబూలాల్‌ అనే ముగ్గురు వ్యక్తులను.. వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న చిరంజీవిపై దాడి చేశారని ఆరోపిస్తూ గత నెల 27న పోలీసులు అరెస్ట్‌ చేశారు. అంతే కాకుండా వారిపై పలు కేసులు, రౌడీషీట్లు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే వారిని ఐతానగర్ ప్రాంతానికి తీసుకెళ్లి శారీరకంగా శిక్షించినట్లు తెలుస్తోంది. టూ టౌన్‌ సీఐ రాములు నాయక్‌, త్రీ టౌన్‌ సీఐ ఎస్‌ రమేష్‌ బాబు నడిరోడ్డు మీద వారిని అరికాళ్లపై లాఠీలతో అమానుషంగా కొట్టిన వీడియో సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమైంది.

video-of-police-lathicharge-in-tenali-goes-viral-one-person-suspended

అయితే వారిలో ఒకరు దెబ్బలకు తాళలేక కాళ్లు ముడుచుకోగా.. సీఐ రాముల నాయక్‌ బూటు కాళ్లతో తొక్కి పట్టుకున్నారు. నిందితుల్లో ఇరువురు ఎస్సీ సామాజిక సామాజిక వర్గానికి.. మరొకరు మైనార్ వర్గానికి చెందిన వారుగా గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకొని కోర్టు ముందు హాజరు పరిచి శిక్ష అమలయ్యేలా చూడకుండా.. ఈ రకంగా దాడికి దిగడం ఏమిటని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వీడియోను వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సైతం సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తీవ్రంగా విమర్శించారు. "తప్పు చేసినా వారిని కొట్టే హక్కు పోలీసులకు లేదు. ఇది బాబు పాలనలో పౌరహక్కులు లేని దుస్థితి" అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు.

ఈ ఘటనపై మానవ హక్కుల సంఘాలు, ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించడంతో పోలీసు శాఖ వేగంగా స్పందించింది. వీడియోలో కనిపించిన పోలీసు అధికారిని తక్షణమే సస్పెండ్ చేశారు. అలానే కానిస్టేబుల్‌పై దాడి ఘటనను మూడు రోజులు పోలీసులు గోప్యంగా ఉంచడానికి కారణం ఏంటి ? అని విచారణ చేపట్టామని అధికారులు తెలిపారు. కస్టడీ లోపల గానీ, బహిరంగంగా గానీ హింసను ప్రేరేపించమని.. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకుంటామని ఓ సీనియర్ పోలీసు అధికారి ప్రముఖ మీడియా సంస్థకు వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+