డ్రగ్స్ మాఫియాపై యుద్ధం.. యూత్‌ను కాపాడేందుకు వస్తున్న 'స్కాలర్'!
పొగాకు శిరీష మహేష్ న్యూ జెర్సీ యూఎస్ఏ వారి సౌజన్యంతో కౌశిక్, ప్రతిభా సిన్హా హీరో హీరోయిన్స్‌గా, సుధాకర్ గౌడ్, పెంచల్ రెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'స్కాలర్'. నవంబర్ 14 చిల్డ్రన్స్ డే సందర్భంగా తెలుగు ఫిలిం చాంబర్ వేదికగా శ్రీ లక్ష్మి ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్, సంతోష్ ఫిలిమ్స్, రామకృష్ణారెడ్డి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫస్ట్ లుక్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. గతంలో ఎన్నో సందేశాత్మక బాలల చిత్రాలను నిర్మించిన భీమగాని సుధాకర్ గౌడ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యూత్ ఫుల్ కమర్షియల్ సందేశాత్మక చిత్రం 'స్కాలర్' ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ వేడుకలో ఘనంగా విడుదలైంది.
ఈ కార్యక్రమానికి బీజీఆర్ మైనింగ్ డైరెక్టర్ బాలకోటి రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేయగా... జూబ్లీహిల్స్ క్లబ్ ప్రెసిడెంట్ చక్రవర్తి రెడ్డి, రామకృష్ణారెడ్డి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండేషన్ ఛైర్మన్ పెంచల్ రెడ్డి విశిష్ట అతిథులుగా పాల్గొని 'స్కాలర్' ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా దర్శక నిర్మాత డాక్టర్ భీమగాని సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ... సమాజంలో యువతను పెడదోవ పట్టిస్తూ నిలువెల్ల ముంచేస్తున్న డ్రగ్స్, గంజాయి అనే మహమ్మారి బారిన పడకుండా యువతను ఎలా రక్షించాలి, వాటి ప్రభావం నుంచి వారిని ఎలా వెనక్కి తీసుకురావాలనే ప్రధానాంశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఓ కుర్రాడు డ్రగ్స్‌కు బానిసలైన వారిని సాధారణ స్థితికి తీసుకురావడానికి ఒక డ్రగ్ కనిపెట్టి అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించడం, ఆ డ్రగ్ మాఫియా అతని కుటుంబాన్ని, చెల్లెలిని అంతం చేస్తే... ఆ డ్రగ్ మాఫియాను ఒక స్పిరిచ్యువల్ బ్యాక్‌డ్రాప్‌లో దేశం నివ్వెరపోయే రీతిలో హీరో ఎలా అంతం చేస్తాడనే ఉత్కంఠభరితమైన కథాంశంతో ఈ చిత్రం ఉంటుందని వెల్లడించారు. త్వరలోనే సినిమా షూటింగ్ విశేషాలను తెలియజేస్తామని ఆయన పేర్కొన్నారు. చిల్డ్రన్స్ డే సందర్బంగా ఫిలింనగర్ ప్రభుత్వ పాఠశాల బాల బాలికలకు, ఇతర స్కూళ్లలో ప్రతిభ కలిగిన విద్యార్థులకు మెమెంటో గోల్డ్ మెడల్ ప్రశంసా పత్రాలతో బహూకరణ జరిగింది.














Click it and Unblock the Notifications
