ధనుష్ 'ఓం' మూవీ ట్రైలర్ రిలీజ్.. నవంబర్ 20 గ్రాండ్ రిలీజ్

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. గతేడాది కుబేర సినిమాతో మంచి హిట్ అందుకున్న ఆయన ఇప్పుడు 'ఓం' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అమరన్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి తెరకెక్కిస్తున్న మూవీ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.

Dhanush latest Telugu trailer for Dhanush Om released arriving in theaters on November 20th

ఆంధ్రప్రదేశ్‌ లోని శేషాచలం అడవుల్లో జరిగే ఎర్ర చందనం స్మగ్లింగ్‌ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, అలాగే సాయి పల్లవి, శ్రీలీల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ట్రైలర్ రన్ టైమ్ దాదాపు మూడు నిమిషాలు ఉంది. ఈ ట్రైలర్‌ ఆద్యంతం యాక్షన్‌ సన్నివేశాలతో ఉత్కంఠగా సాగింది. ఓం మూవీ ట్రైలర్.. సినిమాపై ఆసక్తిని మరింతగా పెంచింది.

ఈ మూవీలో సాయి పల్లవి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి యువ సంగీత సంచలనం సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. భారీ తారాగణంతో అత్యున్నత నిర్మాణ విలువలతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం నవంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ గా విడుదలకు సిద్ధం అవుతోంది. ఇక ధనుష్, ముమ్ముట్టి కలిసి నటిస్తున్న తొలి మూవీ ఇదే కావడం విశేషం. ఈ క్రమంలో సినిమాపై అంచనాలు భారీగా నెలకున్నాయి. అటు అమరన్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రాజ్ కుమార్ పెరియసామి నుంచి వస్తున్న సినిమా ఇదే కావడంతో అంచనాలు నెలకున్నాయి. ఇక నవంబర్ 20 న ఈ మూవీ తొలి పార్ట్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మరి ఓం మూవీతో మరోసారి ధనుష్ సూపర్ హిట్ కొడతాడా..? లేదా..? అనేది తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+