ఆంధ్రా స్టైల్ పులిహోర గోంగూర పచ్చడి.. ఇలా చేస్తే కూరలు మర్చిపోతారు!
తెలుగు వారి వంటింట్లో గోంగూర పచ్చడికి ప్రత్యేక స్థానం ఉంది. వేడి వేడి అన్నంలో నెయ్యి కలిపి ఈ పచ్చడి వేసుకుంటే రుచి అదిరిపోతుంది. ముఖ్యంగా పులిహోర గోంగూర నిల్వ పచ్చడి అయితే ఒక్కసారి చేస్తే సంవత్సరం పాటు తాజాగా ఉంటుంది. రసాయనాలు ఏమీ కలపకుండా సాంప్రదాయ పద్ధతిలో తయారు చేస్తే ఇల్లంతా గుమగుమలాడుతూ ఉంటుంది.
కావాల్సిన పదార్థాలు (1 కిలో గోంగూరకు):
తాజా గోంగూర ఆకులు - 1 కిలో (ఎర్ర కాండం ఉన్నవి మంచివి, ఎక్కువ పులుపు ఉంటాయి)
ఎండు మిరపకాయలు - 150 నుండి 200 గ్రాములు (కారం రుచికి సరిపడా)
వెల్లుల్లి రెబ్బలు - 2 పెద్ద సైజు (పొట్టు తీసినవి)
కల్లు ఉప్పు- 200 గ్రాములు
చింతపండు - 50 గ్రాములు
ఆవాలు - 2 టీస్పూన్లు
పచ్చి శనగపప్పు - 2 టీస్పూన్లు
మినపప్పు - 1 టీస్పూన్
మెంతులు - 2 టీస్పూన్ లు
కరివేపాకు - కొద్దిగా
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - తగినంత (సుమారు 2 నుంచి 3 కప్పులు)

తయారీ విధానం:
మొదట గోంగూర ఆకులను కాండాల నుంచి వేరు చేసి బాగా కడగాలి. ఆ తర్వాత టవల్ మీద లేదా పరిశుభ్రమైన గుడ్డ మీద పరచి పూర్తిగా తడి లేకుండా ఆరబెట్టాలి. ఇది చాలా ముఖ్యం. తడి ఉంటే పచ్చడి త్వరగా పాడవుతుంది. కనీసం 2 నుంచి 3 గంటలు లేదా ఒక రోజు నీడలో ఆరబెట్టడం ఉత్తమం.తర్వాత మందపాటి కడాయిలో కొద్దిగా నూనె వేసి తక్కువ మంటపై గోంగూర ఆకులను వేయించాలి.
ఆకులు ముడుచుకుని రంగు మారే వరకు (కాస్త ముదురు ఆకుపచ్చ రంగు వచ్చేలా) వేయించాలి. ఆపై ఎండుమిర్చిని దోరగా వేయించి, వేయించిన మెంతులు, కల్లు ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, వేయించిన ఎండు మిరపకాయలు వేసి మిక్సీలో కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండును ఉడికించి అందులో గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని కలపాలి. అందులోనే గోంగూర కూడా వేసి కలపాలి.
ఇప్పుడు నూనె వేడి చేసి ఆవాలు, శనగపప్పు, మినపప్పు, మెంతులు వేసి పప్పులు క్రిస్పీగా అయ్యే వరకు వేయించాలి. ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు, ఎండు మిరపకాయలు, కరివేపాకు వేసి 30 సెకన్లు వేయించి స్టవ్ ఆపేయాలి. ఈ తాలింపు పూర్తిగా చల్లారిన తర్వాత గోంగూర పచ్చడి మిశ్రమంలో కలపాలి.మొత్తం మిశ్రమాన్ని మిక్సీలో కాస్త కోర్స్‌గా (రోట్లో దంచినట్లు) వేసుకుంటే సరిపోతుంది. చాలా మెత్తగా చేయకూడదు. చల్లారిన పచ్చడిని శుభ్రమైన, పొడి సీసాలో నింపి, పైన కొద్దిగా నూనె పోసి మూత బిగించాలి.
ఈ పచ్చడిని తడి చేతులతో లేదా తడి గరిటెతో తాకకూడదు. ప్రతిసారి పొడి గరిటెతోనే తీసుకోవాలి. నూనె పైన తేలేలా ఉండేలా చూసుకుంటే సంవత్సరం పాటు రూమ్ టెంపరేచర్లోనే నిల్వ ఉంటుంది. గోంగూరలో ఐరన్, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. జీర్ణక్రియకు మంచిది, రక్తహీనతకు కూడా ఉపయోగపడుతుంది. ఈ నిల్వ పచ్చడి అన్నం, దోసె, ఇడ్లీ, రోటీతో ఎంతో బాగుంటుంది. ఒక్కసారి ఇలా చేసి పెట్టుకుంటే కూరలు మర్చిపోయి పచ్చడి తోనే తింటారు.













Click it and Unblock the Notifications
