అంబటికి బిగుస్తున్న ఉచ్చు - తాజా నిర్ణయంతో, ఇక..!!

వైసీపీ నేత అంబటి రాంబాబుకు ఉచ్చు బిగుస్తోంది. వైసీపీ హయాంలో అంబటి పైన వచ్చిన ఆరోపణల పైన విచారణ మొదలైనట్లు తెలుస్తోంది. జగనన్న కాలనీల కోసం భూముల కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్డారని అంబటి పైన ఆరోపణలు ఉన్నాయి. రియల్‌ వెంచర్లలో ల్యాండ్‌ కన్వర్షన్‌కు ఎకరాకు 5 లక్షలు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయి. అదే విధంగా విద్యుత్ కేంద్రాల్లో పోస్టుల కోసం డబ్బు వసూలు చేసారనే ఆరోపణల పైన విజిలెన్స్ విచారణ జరుగుతోంది. దీంతో, అంబటి పైన తదుపరి చర్యల పై రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది.

వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సమయంలో అంబటి రాంబాబు భారీ ఎత్తున అక్రమార్జనకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. రియల్‌ ఎస్టేట్‌, ఉద్యోగుల బదిలీలు, కోడి పందేల వరకు పలు ఆరోపణలు వచ్చాయి. ముగ్గురాయి వ్యాపారుల ముక్కుపిండి మరీ రూ.కోట్లు వసూలు చేసినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగానికి ఇబ్బడిముబ్బడిగా ఫిర్యాదులు రావడంతో కదలిక ప్రారంభమైంది. మాజీ మంత్రి అవినీతి వ్యవహారం తేల్చాలని ప్రభుత్వం ఆదేశించడంతో విజిలెన్స్‌ అధికారులు రంగంలోకి దిగినట్లు సమాచారం. ప్రధాన ఫిర్యాదుల పైన విజిలెన్స్ పూర్తి సమాచారం సేకరించి ప్రభుత్వానికి నివేదించేందుకు ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.

vigilance-investigation-begins-over-corruption-allegations-against-ambati

ఇక జగనన్న కాలనీల కోసం ఎకరం రూ.10 లక్షలకు కొనుగోలు చేసి.. అదే భూమిని ప్రభుత్వానికి ఎకరం రూ.30 లక్షలకు అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఆయన వేధింపులు, బెదిరింపులకు తాళలేక సొంత పార్టీ నాయకుడొకరు హైకోర్టును ఆశ్రయించారు. వైసీపీ ప్రభుత్వం ఉండగానే అంబటి అవినీతి బాగోతంపై అనేక ఫిర్యాదులు ఉండటంతో విజిలెన్స్ ఫోకస్ చేసింది. అదే విధంగా అంబటి ప్రధాన అనుచరుడు వందల కోట్లు విలువచేసే రేషన్‌ బియ్యాన్ని కాకినాడ పోర్టుకు తరలించినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ఈ వ్యవహారంలో ఆయనకు ఏటా రూ.కోట్లల్లో ముడుపులు అందాయని చెబుతున్నారు. జగనన్న కాలనీల్లో మట్టి తోలకంలో మంత్రి వాటా 10 శాతం పైగా ఉందనే ఆరోపణలతో ..విజిలెన్స్ పూర్తి స్థాయిలో విచారణ చేస్తోంది. దీంతో.. ఇప్పుడు అంబటి విషయంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తిగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+