జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన విజయభాస్కర్ రెడ్డి
చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన కాంగ్రెస్ నాయకుడు విజయభాస్కర్ రెడ్డి మంగళవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా, చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన కాంగ్రెస్ నాయకుడు విజయభాస్కర్ రెడ్డి మంగళవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలోనే విజయభాస్కర్ రెడ్డి పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్నారు. ఈ సందర్భంగా విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. వైసీపీ బలోపేతానికి తనవంతుగా కృషి చేస్తానని అన్నారు.

ఇది ఇలా ఉండగా, మాజీ మంత్రి, దివంగత నేత కోటగిరి విద్యాధరరావు తనయుడు కోటగిరి శ్రీధర్ కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు సమాచారం. జనవరి 29న పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో నిర్వహించే బహిరంగ సభలో ఆయన పార్టీలో చేరనున్నట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications