వైసిపి నేతల ఫోన్ల ట్యాపింగ్: డిజిపి తో సహా వారిని తప్పించాలి : ఇసికి సాయిరెడ్డి ఫిర్యాదు..!
ఏపి ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని వైసిపి ఎంపి విజయ సాయి రెడ్డి కేంద్ర ఎన్నికల ప్రధానాధికా రి కి ఫిర్యాదు చేసారు. తమ పార్టీ నేతల ఫోన్లు ట్యాపింగ్ కు పాల్పడుతున్నారని ఆధారాలను ఇసికి అందించారు. ఇక, ఏపి డిజిపి తో పాటుగా పలువురు పోలీసు అధికారులను ఎన్నికల విధుల నుండి తప్పించాలని ఇసిని కోరారు. ఇక, ప్రజాశాం తి పార్టీ గుర్తును తొలిగించాని అభ్యర్దించారు.
ఫోన్ల ట్యాపంగ్ కు పాల్పడుతున్నారు..

ఆ పోలీసు అధికారుల పై..
డిజిపి ఠాకూర్ తో సహా పలువురు అధికారులను ఎన్నికల విధుల నుండి తప్పించాలని సాయిరెడ్డి ఎన్నికల సంఘం కు నివేదించారు. డీజీపీ, ఇంటెలిజెన్స్ ఐజీ, ప్రకాశం జిల్లా ఎస్పీని విధుల నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్న పోలీస్ అధికారులను బదిలీ చేయాలని, పోలీసులు దగ్గరుండి నారాయ ణ కాలేజీ నుంచి డబ్బు తరలించారని ఆరోపించారు. సాక్ష్యాధారాలను సీఈసీ ముందుంచామని విజయసాయి తెలిపా రు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం తీరును ఈసీ దృష్టికి తీసుకెళ్లామని, చట్ట వ్యతిరేకంగా 37 మంది సీఐలకు పదోన్నతిపై కూడా ఈసీ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీలో అదనపు బలగాలను ఏర్పాటు చేయాలని కోరామని, న్యాయం జరుగుతుందనే నమ్మకం తమకు ఉందన్నారు.












Click it and Unblock the Notifications