అబద్ధాల నరసింహా - జీవీఎల్ పై సాయిరెడ్డి సెటైర్లు : ప్రధాని- షా నిర్ణయిస్తే మార్చగలమా..!!
ఏపీకి ప్రత్యేక హోదా అంశం పై చర్చకు హోం శాఖ ప్రతిపాదన..ఆ తరువాత రద్దు చేయటం పైన ఇంకా మాటల యుద్దం సాగుతూనే ఉంది. దీని పైన తొలి నుంచి బీజేపీ ఎంపీ జీవీఎల్ స్పందిస్తున్నారు. హోదా అనేది ఏపీకి సంబంధించిన అంశమని...తెలంగాణతో కలిసి చర్చల సమయంలో ఆ అంశం ఎందుకు ప్రస్తావిస్తారని ప్రశ్నించారు. అది హోం శాఖలో జూనియర్ అధికారుల పొరపాటుగా పేర్కొన్నారు. అదే సమయంలో దీనికి సంబంధించి కేంద్ర హోం శాఖ కార్యదర్శికి జీవీఎల్ లేఖ రాసారు. రాష్ట్రంలోని అధికార పార్టీకి కేవలం ప్రచార ఆర్భాటం తప్ప.. సమస్యల పరిష్కారంపై ఏ మాత్రం దృష్టి లేదన్నారు.
వైసీపీ ఎంపీలు చేయాల్సింది తానే..
వైసీపీ ఎంపీలు చేయాల్సిన పని తానే చేస్తున్నానని చెబుతూ... కేంద్ర పథకాలకు స్టిక్కర్లు వేసుకుని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సరైన ఆదాయ వనరులు లేని రాష్ట్రానికి హోదా ఇవ్వాలన్నారు. ఏపీకి అంతకుమించి ప్యాకేజీ రూపంలో కేంద్రం నిధులు ఇచ్చిందని చెప్పుకొచ్చారు. అన్నీ తెలిసీ జగన్ ప్రత్యేక హోదా అంశాన్ని ఎత్తుకున్నారని విమర్శించారు. కేంద్ర హోంశాఖ సెక్రటరీ అజయ్ కుమార్ భల్లాకి లేఖ రాశానని వివరించారు. ఇరు రాష్ట్రాల మధ్య వివాదాస్పద సమస్యలపై చర్చించాలని సూచించారు. ప్రత్యేక హోదా లేదని వ్యాఖ్యానించారు.
ప్రధాని..అమిత్ షా నిర్ణయిస్తే మార్చగలమా
తానే కేంద్ర హోం శాఖ అధికారులతో మాట్లాడి హోదా అంశం తొలగించారనడం ఆశ్చర్యంగా ఉందన్నారు. మోదీ, అమిత్ షా నిర్ణయిస్తే మేము మార్చగలమా అంటూ జీవీఎల్ ప్రశ్నించారు. ఈ వ్యవహారం ..జీవీఎల్ వ్యాఖ్యల పైన విజయ సాయిరెడ్డి స్పందించారు. అయ్యా.. అబద్ధాల నరసింహా.. అంటూ ప్రశ్నలు సంధించారు. వైకాపా 22 ఎంపీ సీట్లు గెలిచినందుకే ఏపీకి న్యాయం చేయట్లేదా..లేక భాజపాకు 301 సీట్లు వచ్చినందుకు న్యాయం చేయట్లేదా... అని నిలదీశారు. రాష్ట్రం కోసం తాము అడగనిది లేదని స్పష్టం చేశారు. దానికి మీరు ఏం ఇచ్చారో చెప్పండి చాలు అంటూ తన ట్వీట్ లో సెటైరిక్ గా ప్రశ్నించారు.

జీవీఎల్ కు సాయిరెడ్డి ట్వీట్ తో..
దీనికి కొనసాగింపుగా మరో ట్వీట్ చేసారు. అందులో.. అయ్యా...పగటి కలల నరసింహా! ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేసినట్టు; విభజన హామీలన్నీ అమలు చేసినట్టు, ప్రత్యేక ప్యాకేజీ, కొత్త రైల్వే లైన్లు తీసుకు వచ్చినట్టు...ఇవన్నీ జీవీఎల్ వల్లే జరుగుతున్నట్టు..జరగనివి జరిగినట్లు చెపుతున్న మీకు చంద్రబాబు అజ్ఞాత గురువు అని భావించాల్సివస్తోంది..అంటూ పేర్కొన్నారు. ఇక, ఇదే అంశం పైన టీడీపీ - వైసీపీ ఎంపీల మధ్య సవాళ్లు మొదలు అయ్యాయి. టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు హోదా కోసం గతంలో చెప్పిన విధంగా వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాలని..తాము వెంటనే చేస్తామని చెప్పుకొచ్చారు. వైసీపీ ఎంపీలు మాత్రం టీడీపీ.. బీజేపీ లక్ష్యంగా తమ విమర్శలు కొనసాగిస్తున్నారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications