వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్ కేసు: విజయ సాయిరెడ్డికి బెయిల్

|
Google Oneindia TeluguNews

Vijaya Sai Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి‌కి సంబంధించిన అక్రమాస్తుల కేసులో రెండో నిందితుడు విజయసాయిరెడ్డికి మంగళవారం నాంపల్లి సిబిఐ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 2లక్షల రూపాయలు, ఇద్దరు పూచీకత్తు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. కాగా విజయసాయిరెడ్డి బుధవారం జైలు నుంచి విడుదల కానున్నారు.

హైదరాబాద్ విడిచి వెళ్లకూడదని, కేసు విషయంపై ఎవరితోనూ మాట్లాడరాదని సిబిఐ కోర్టు ఆదేశించింది. ఒక వేళ హైదరాబాద్ విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడితే కోర్టు అనుమతి తీసుకోవాలని కోర్టు పేర్కొంది. గతంలో రెండు సార్లు బెయిల్‌పై విడుదలైన విజయసాయిరెడ్డిని కేసు తీవ్రత దృష్ట్యా జైలుకు వెళ్లాలని కోర్టు ఆదేశించడంతో 4నెలలుగా జైల్లోనే ఉన్నాడు.

తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ విజయసాయిరెడ్డి కోర్టులో ఇంతకుముందు పిటిషన్ దాఖలు చేశారు. సిబిఐ ఆరోపణలకు సంబంధించి ఏ చిన్న ఆధారాలు కూడా చూపించట్లేదని, బెయిల్‌ను అడ్డుకోవాలని సిబిఐ నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని సాయిరెడ్డి తరపు న్యాయవాది కోర్టుకు నివేదించారు. విచారణను మంగళవారానికి వాయిదా వేసిన కోర్టు, షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

ఇటీవల ఆస్తుల కేసులో ప్రధాన నిందితుడు జగన్మోహన్ రెడ్డి కూడా షరతులతో కూడి బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందె. కాగా జగన్ అక్రమాస్తుల కేసులో నిందితులు నిమ్మగడ్డ ప్రసాద్, కెవి బ్రహ్మానందరెడ్డిలు మంగళవారం చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. వీరికి సోమవారం కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

English summary
Accused in YSR Congress Party president YS Jaganmohan Reddy's DA case, Vijayasai Reddy has been granted bail by Nampally CBI Court In Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X