Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వెనక్కు తగ్గిన సాయిరెడ్డి - రీ ఎంట్రీ, అక్కడే ట్విస్ట్...!?

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఢిల్లీ - అమరావతి కేంద్రంగా కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. కూటమి మూడు పార్టీలు రాజ్యసభ .. ఎమ్మెల్సీ స్థానాల్లో షేరింగ్ తో ముందుకు వెళ్తున్నాయి. ఇక, వైసీపీ ముఖ్య నేతగా వ్యవహరించిన సాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు చోటు చేసుకుంటున్న తాజా సమీకరణాల వేళ సాయిరెడ్డి అడుగులు ఆసక్తి కరంగా మారుతున్నాయి. ఢిల్లీ కేంద్రంగా కొత్త వ్యూహంతో సిద్దం అవుతున్నట్లు సమాచారం.

మారుతున్న లెక్కలు
విజయ సాయిరెడ్డి నాడు వైఎస్ .. ఆ తరువాత జగన్ వద్ద కీలకంగా వ్యవహరించారు. వైసీపీ తొలి రాజ్యసభ సభ్యుడుగా పని చేసారు. 2024 ఎన్నికల ఫలితం తరువాత చోటు చేసుకున్న వరుస పరిణామాలతో సాయిరెడ్డి ఆకస్మిక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ రాజ్యసభ పదవితో పాటుగా పార్టీకి రాజీనామా చేసారు. జగన్ ఆ తరువాత సాయిరెడ్డి రాజీనామా పైన కీలక వ్యాఖ్యలు చేసారు. రాజకీయాల్లో ఉన్న వారికి విలువలు ఉండాలని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్ పైన సాయిరెడ్డి సైతం స్పందించారు. తాను వ్యవసాయం చేసుకుంటానని.. ఏ పార్టీలో చేరే అవకాశం లేదని తేల్చి చెప్పారు. దీంతో, సాయిరెడ్డి ఇక రాజకీయాలకు దూరంగా ఉంటారని డిసైడ్ అయిపోయారు.

Vijaya Sai Reddy likely to re entry in politics soon as reports

సాయిరెడ్డి నెక్స్ట్ స్టెప్
రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన తరువాత సాయిరెడ్డి పీసీసీ చీఫ్ షర్మిల తో భేటీ అయ్యారు. ఆ సమయంలో తన పైన చేసిన వ్యాఖ్యలు వెనుక కారణాలను తనకు వివరించి నట్లు షర్మిల వివరించారు. ఇక.. రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఉంటున్న సాయిరెడ్డి తాజాగా రాజ్యసభ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న ఉప రాష్ట్రపతి థన్ కర్ హైదరాబాద్ కు వచ్చిన సమయంలో ప్రత్యక్షం అయ్యారు. సాయిరెడ్డికి ఆయన సైతం ప్రాధాన్యత ఇచ్చారు. సాయిరెడ్డి ఆకస్మికంగా ఈ పర్యటనలో ప్రత్యక్షం అవ్వటం ద్వారా కొత్త చర్చ తెర మీదకు వచ్చింది. సాయిరెడ్డి కి బీజేపీలోని ముఖ్య నేతలతో ఉన్న సత్సంబంధాలు చర్చకు వస్తున్నాయి.

Take a Poll

బీజేపీ తో టచ్ లో
ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా కొత్త చర్చ జరుగుతోంది. సాయిరెడ్డి తిరిగి రాజకీయంగా జూన్ నెల నుంచి యాక్టివ్ కానున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే, వైసీపీ నుంచి కాకుండా బీజేపీలోకి సాయిరెడ్డి ఎంట్రీ ఇవ్వబోతున్నారనేది ఈ ప్రచారం సారాంశం. 2019 ఎన్నికల ముందు.. ఆ తరువాత బీజేపీ - వైసీపీ మధ్య వారధిగా సాయిరెడ్డి వ్యవహరించారు. ఇప్పుడు ప్రచారం జరుగుతున్నట్లుగా సాయిరెడ్డి బీజేపీకి దగ్గరైతే వైసీపీతో ఎలాంటి సంబంధాలు కొనసాగిస్తారనే చర్చ మొదలైంది. వైసీపీలో కీలకంగా వ్యవహరించిన సాయిరెడ్డి వచ్చే ఎన్నికల నాటికి రాజకీయంగా యాక్టివ్ అవ్వటం ఖాయమని.. అయితే, ఏ పార్టీలో ఉంటారు.. ఎలాంటి పాత్ర పోషిస్తారనేదే తేలాల్సి ఉందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో కొనసాగుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+