జగన్ కు కోటరీతోనే నష్టం, ఆ కేసుల్లో వారే సూత్రధారులు - సాయి రెడ్డి సంచలనం..!!
వైసీపీ మాజీ నేత విజయ సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. తాను పార్టీ మారటానికి కారణాల ను వివరించారు. పోర్టు .. లిక్కర్ కేసులో సూత్రధారులు ఎవరో తన అభిప్రాయం స్పష్టం చేసారు. తాను తిరిగి వైసీపీలోకి వెళ్లే అవకాశం లేదని తేల్చి చెప్పారు. జగన్ వద్ద కోటరీ భారీ నష్టం చేసింద వ్యాఖ్యానించారు. చెప్పుడు మాటలు వినటం వలనే అందరూ నష్టపోతున్నారని సంచలన వ్యాఖ్య లు చేసారు. కోటరీ కారణంగానే తాను దూరమయ్యానని చెప్పారు. జగన్ తనను పార్టీలో ఉండమని చెప్పారని.. కోటరీని దూరంగా ఉంచితేనే జగన్ కు భవిష్యత్ ఉంటుందని పేర్కొన్నారు.
సాయిరెడ్డి సంచలనం
వైసీపీ మాజీ ముఖ్య నేత సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. జగన్ కు కోటరీ నష్టం చేస్తుంది అని వ్యాఖ్యానించారు. తన మనసు విరిగిపోయిన కారణంగానే పార్టీ నుంచి బయటకు వచ్చానని చెప్పారు. తాను పార్టీ వీడే సమయంలో జగన్ కు ఫోన్ చేసి ఆయన మనసులో తాను లేనని.. తన మీద నమ్మకం లేనప్పుడు తాను పార్టీలో కొనసాగలేనని చెప్పానని వెల్లడించారు. కోటరీ జగన్ ను తప్పు దోవ పట్టిస్తుందని తాను చెప్పానని వివరించారు. జగన్ తనను పార్టీలో కొనసాగమని కోరారని.. తాను ఉండలేనని స్పష్టం చేసానన్నారు. నాయకుడు చెప్పుడు మాటలు వినకూడదని.. జగన్ కు ఎంతో భవిష్యత్ ఉందని సాయిరెడ్డి వ్యాఖ్యానించారు.

జగన్ లోనే మార్పు
జగన్ తన గురించి మాట్లాడుతూ విశ్వసనీయత ధైర్యం గురించి మాట్లాడారని.. తాను ఇప్పటికీ అవే లక్ష్యాలతో ఉన్నానని సాయిరెడ్డి స్పష్టం చేసారు. జగన్ తోనే మార్పు వచ్చిందని సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. తన మనసు విరిగిపోయిందని.. తిరిగి అతుక్కునే అవకాశం లేదని తేల్చి చెప్పారు. లిక్కర్ స్కాంలో కర్త, కర్మ, క్రియ అన్నీ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని సాయిరెడ్డి స్పష్టం చేసారు. అదే విధంగా పోర్టు వ్యవహారంలో అంతా విక్రమ్ రెడ్డేనని వెల్లడించారు. విక్రమ్ రెడ్డి తనకు సుబ్బారెడ్డి కుమారుడిగానే తెలుసని విచారణలో వెల్లడించానన్నారు. ఇక, సుబ్బారెడ్డి అమెరికాకు వెళ్లిన సమయంలో కేవీ రావు ఇంట్లోనే ఉండే వారని చెప్పుకొచ్చారు. తాను ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదని సాయిరెడ్డి స్పష్టం చేసారు.
ఆ కేసుల్లో వారే
జగన్ కు ఈ కేసులో ప్రమేయం లేదని సాయిరెడ్డి వెల్లడించారు. జగన్ తో తాను చాలా క్లియర్ గా పార్టీలో కోటరీ చేస్తున్న వ్యవహారాల గురించి వివరించానని చెప్పుకొచ్చారు. కోటరీ చెప్పుడు మాటలే నష్టం చేసాయని వివరించారు. తాను చెప్పిన మాట ప్రకారం వ్యవసాయం చేసుకుంటున్నానని.. తాను ఏ పార్టీతోనూ సంబంధాలు కొనసాగించటం లేదని చెప్పుకొచ్చారు. భవిష్యత్ లో ఎలాంటి విచారణకు అయినా తాను సహకరిస్తానని చెప్పారు. ఇప్పుడు సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో సంచలనంగా మారుతున్నాయి. జగన్ కోటరీతో పాటుగా లిక్కర్, పోర్టు కేసుల విషయంలో సాయి రెడ్డి వ్యాఖ్యలతో రాజకీయంగా కలకలం మొదలైంది.












Click it and Unblock the Notifications