వైయస్ పాలనలో చంద్రబాబు లబ్ధి పొందారు, జగన్ ఊరుకోరు: విజయసాయి రెడ్డి
విశాఖపట్నం: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా లబ్ధి పొందారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత విజయసాయి రెడ్డి అన్నారు. విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాల కోసం విడుదల చేసిన జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చింతపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
ఆదివాసీలకు, గిరిజనులకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటారని విజయసాయిరెడ్డి తెలిపారు. ఆదివాసీలకు, గిరిజనులకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలకు దిగిన పార్టీ వైయస్ జగన్ ఊరుకోరని హెచ్చరించారు. ప్రజా వ్యతిరేక చర్యలను ఎండగడతారని అన్నారు.
వైయస్ ఐదేళ్ల పాలనలో ఎంతో చేశారని, సమైక్య రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబానికి ఏదో ఒక రకమైన మేలు జరిగిందని గుర్తు చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుటుంబం కూడా వైయస్ పాలన ద్వారా లబ్ధి పొందిందని అన్నారు. ఆదివాసీల, గిరిజనుల డిమాండ్ ఏమిటో ప్రభుత్వానికి అర్థమయ్యేలా చెప్పడంతోపాటు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా దిశానిర్దేశం జగన్మోహన్ రెడ్డి చేస్తారని తెలిపారు.

జగన్ ను కలిసిన లాజిస్టిక్ హబ్ నిర్వాసితులు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం జిల్లా పర్యటనలో భాగంగా గురువారం యలమంచిలి చేరుకున్నారు. అంతకుముందు అనకాపల్లిలోని నూకాంబిక అమ్మవారిని వైయస్ జగన్ దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం జగన్ ను తుమ్మపాల కో ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ బాధితులు కలిశారు. ఫ్యాక్టరీ ఆధునీకరించేలా చర్యలు తీసుకునేందుకు కృషి చేయాలని ఆయనకి కార్మికులు విజ్ఞప్తి చేశారు. అలాగే తమ బకాయిలు తీర్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. అందుకు వైయస్ జగన్ సానుకూలంగా స్పందించారు.
అలాగే వల్లూరు లాజిస్టిక్ హబ్ భూ నిర్వాసితులు కూడా వైయస్ జగన్ ను కలిశారు. తమకు నష్టపరిహారం చెల్లింపులో పక్షపాతం చూపుతున్నారంటూ వారు వైయస్ జగన్ వద్ద ఆవేదన వక్తం చేశారు. ఈ అంశంలో అన్యాయం జరగకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని జగన్ భూ నిర్వాసితులకు హామీ ఇచ్చారు.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications