జగన్ గారిని ఎదుర్కోడానికి సాము గరిడీలకు వెళ్లి కండలు పెంచండి: లోకేష్,చంద్రబాబులపై సాయిరెడ్డి వ్యంగ్యం

ఏ చిన్న అవకాశం దొరికినా టీడీపీ అధినేత చంద్రబాబుపై విరుచుకు పడే విజయసాయి రెడ్డి అటు చంద్రబాబును, లోకేష్ తోపాటుగా టిడిపి నేతలను టార్గెట్ చేసి నిప్పులు చెరుగుతున్నారు. సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డ విజయసాయిరెడ్డి జగన్ గారిని ఎదుర్కోవడానికి సాముగరిడీలకి వెళ్లి కండలు పెంచాలంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ప్రతిపక్షాల అసంబద్ధ విమర్శలకు వైయస్ జగన్ తన పనితీరు ద్వారా సమాధానం

ప్రతిపక్షాల అసంబద్ధ విమర్శలకు వైయస్ జగన్ తన పనితీరు ద్వారా సమాధానం


చంద్రబాబునాయుడు ఎన్ని విమర్శలు చేసినా, ప్రతిపక్షాలు ఎంతగా ఆడిపోసుకున్నా ప్రతిపక్షాల అసంబద్ధ విమర్శలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ తన పనితీరు ద్వారానే సమాధానం చెబుతున్నారు అంటూ విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు. అంతేకాదు ప్రజా సంక్షేమం, కోవిడ్ విపత్తును ఎదుర్కోవడం, పేదలకు లక్షల్లో ఇళ్ల నిర్మాణం.. ఇలా ప్రతీ అంశంలోనూ జగన్ రికార్డులు సృష్టిస్తున్నారు. ఈ రికార్డులు జగన్ గారి పాలన దక్షతకు నిదర్శనం అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

జగన్ గారిని ఎదుర్కోవడానికి సాముగరిడీలకి వెళ్లి కండలు పెంచండి

జగన్ గారిని ఎదుర్కోవడానికి సాముగరిడీలకి వెళ్లి కండలు పెంచండి


జగన్ ని ఎదుర్కోవడం ఎవరి తరం కాదని పేర్కొన్న విజయసాయిరెడ్డి జగన్ గారిని ఎదుర్కోవడానికి సాముగరిడీలకి వెళ్లి కండలు పెంచండి అంటూ సెటైర్లు వేశారు. ప్రజల నోటిదగ్గర ముద్దు అని మాత్రం లాగేయకండి బాబు అంటూ పేర్కొన్నారు. అధికారం కోల్పోయినప్పటి నుంచి జనం జీవనాధారంపై ఎలా దెబ్బకొట్టాలా అని ఎల్లో మీడియా అంతేవాసుల ముఠా చేయని కుట్ర అంటూ లేదంటూ విమర్శించారు. ఇక్కడ జరిగే ప్రతి దుర్మార్గం వెనుక మీరే ఉంటున్నారు అంటూ చంద్రబాబును, టిడిపి నేతలను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు.

మాలోకం వేస్ట్ ఫెలో అని అచ్చెన్న తేల్చేశారని సెటైర్

మాలోకం వేస్ట్ ఫెలో అని అచ్చెన్న తేల్చేశారని సెటైర్


మాజీ మంత్రి నారా లోకేష్ ను టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి అచ్చెన్న మాటలను పదేపదే గుర్తు చేస్తున్నారు. మాలోకం ఎలాంటి వాడో అచ్చెన్నకు తెలుసని చెప్తున్నారు. వాడు సరిగ్గా ఉంటే పార్టీకి ఈ దుస్థితి ఎందుకు వచ్చేది అన్న అచ్చెన్న మాటల్లో వాస్తవం ఉందని మళ్లీ రుజువు అయింది కదా అంటూ ఎద్దేవా చేశారు విజయ సాయి రెడ్డి. మనిషి బారెడు మెదడు చిటికెడు అంటారు కానీ మ్యాటర్ ను అచ్చెన్న అంతే పెట్టేశాడు అంటూ ట్వీట్ చేశారు. మాలోకం వేస్ట్ ఫెలో అని ఎప్పుడో తేల్చాడు. ఇప్పుడు ఎవరు ఎంత చించుకున్నా లాభమేముంది అంటూ విజయసాయి రెడ్డి లోకేష్ ను టార్గెట్ చేశారు.

 చంద్రబాబుపై సైరా పంచ్ వేసిన సాయిరెడ్డి

చంద్రబాబుపై సైరా పంచ్ వేసిన సాయిరెడ్డి

ఇదే సమయంలో సైరా పంచ్ వేశారు విజయసాయిరెడ్డి. బాబుని కుప్పానికి తరిమిన మీసాల నాయుడు అంటూ ఓ పేపర్ క్లిప్పింగ్ ను షేర్ చేసిన విజయసాయిరెడ్డి కాదండి... చంద్రగిరిలో ఓడిం,చి కుప్పానికి తరిమేసి కుప్పం పంచాయతీ ఎన్నికల్లోనూ ఓడించి, జూనియర్ ఎన్టీఆర్ రావాలని పుట్టిన గడ్డ లో ఫ్లెక్సీలు కడితే బాధగా ఉండదా అండీ.. అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇది వెన్నుపోటు కాదు పగ, కసి, కక్ష , రివెంజ్ అంటూ మామ ఇలాకాలో అల్లుడు జపం అంటూ సెటైర్లు వేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+