• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కనీసం ఎమ్మెల్యే కూడా కాని వాడు ఏకంగా సీఎం కుర్చీ ఎక్కుతాడట : పవన్ , బీజేపీపై సాయిరెడ్డి సెటైర్లు

|
Google Oneindia TeluguNews

తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల నేపథ్యంలో అధికార వైసిపికి, ప్రతిపక్ష పార్టీలకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో సీఎం అంటూ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై, ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. తిరుపతి లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుంటే కాబోయే సీఎం ఫలానా అంటూ బిస్కెట్ వేయడం తప్ప మరేమిటి అంటూ ప్రశ్నించిన విజయసాయిరెడ్డి అటు బీజేపీ ఇటు జనసేనల పరువు నిలువునా తీశారు.

ఆ పార్టీలది ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. తండ్రీ కొడుకుల ధృతరాష్ట్ర కౌగిలిలో టీడీపీ : సాయిరెడ్డి సెన్సేషన్ఆ పార్టీలది ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. తండ్రీ కొడుకుల ధృతరాష్ట్ర కౌగిలిలో టీడీపీ : సాయిరెడ్డి సెన్సేషన్

జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందంట

జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందంట

ఆఫర్ చేసే పార్టీకి రాష్ట్రంలో ఒక సీటు లేదు, ఇక ఆఫర్ తీసుకునే పార్టీకి ఉనికి లేదు. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందంట .. కనీసం ఎమ్మెల్యే కూడా కాని వాడు ఏకంగా సీఎం కుర్చీ ఎక్కుతాడట అంటూ బీజేపీ-జనసేన లను, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో ఓటమి పాలు కావడాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు.

అంతేకాదు చంద్రబాబును సైతం టార్గెట్ చేసి విమర్శలు గుప్పించిన విజయసాయిరెడ్డి రాయపాటి బ్యాంకులకు టోకరా వేశాడని , అందులో సగం బాబే నోక్కేశాడని వ్యాఖ్యలు చేశారు .

సూయజ్ కాలువ నౌక కదిలింది కానీ చంద్రబాబు పై ఉన్న స్టేలు మాత్రం కదలవు

సూయజ్ కాలువ నౌక కదిలింది కానీ చంద్రబాబు పై ఉన్న స్టేలు మాత్రం కదలవు

విజయ్ మాల్యా బ్యాంకులకు తొమ్మిది వేల కోట్లు బాకీ పడి లండన్ పారిపోయాడు . ఇక ట్రాన్స్ ట్రాయ్ పేరుతో 10 వేల కోట్లు బ్యాంకుల లూటీకి పాల్పడిన టిడిపి మాజీ ఎంపీ రాయపాటి మాత్రం దొరలా తిరుగుతున్నాడు. బ్యాంకుల నుండి లూటీ చేసిన మొత్తంలో జగన్ చంద్రబాబు నొక్కేశాడు . ఇక దర్యాప్తులో జాతకాలు అన్ని బయటకు వస్తాయి అంటూ చంద్రబాబును టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. ఇక అంతే కాదు

వారం తర్వాత సూయజ్ కాలువ లో ఇరుక్కున్న భారీ నౌక కదిలింది కానీ చంద్రబాబు పై ఉన్న స్టేలు మాత్రం కదలవు. ఎవర్ గివెన్ నౌక గమ్యాన్ని చేరుతుంది కానీ ఎవర్ స్టేలు మాత్రం అలానే ఉన్నాయి అంటూ చంద్రబాబు పై ఉన్న స్టేల విషయంలో ఆసక్తికర ట్వీట్ చేశారు .

తలనీలాల విషయంలో విషప్రచారం ఆగదు

తలనీలాల విషయంలో విషప్రచారం ఆగదు

ఇదే సమయంలో సైరా పంచ్ వేసిన విజయసాయిరెడ్డి తిరుమలలో స్వామివారికి భక్తులు సమర్పించిన తలనీలాల ఇతర దేశాలకు అక్రమంగా తరలించబడుతున్నాయని విష ప్రచారం తిరుపతి ఉప ఎన్నిక ఉంది ఆగదని, అవి టిడిపి కి సంబంధించిన తలనీలాల కాదని కస్టమ్స్ రిపోర్టు ఇచ్చినప్పటికీ కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని పోస్ట్ చేశారు. ఇక అందులో మతకలహాల కోసం దేవుళ్ళ తలలు తొలగించిన పచ్చ మందకి తలనీలాల విషప్రచారం చాలా చిన్న విషయం అంటూ సాయి రెడ్డి పేర్కొన్నారు.

 ఇప్పుడు గంటల పంచాంగం చెప్పినా ఓటమి చంద్రబాబును తరుముతోంది

ఇప్పుడు గంటల పంచాంగం చెప్పినా ఓటమి చంద్రబాబును తరుముతోంది

అంతేకాదు గతంలో టిడిపి గెలుస్తుందని ఎన్నికలకు ముందు ఆంధ్రా ఆక్టోపస్ బయల్దేరాడు అని, ఆక్టోపస్ ఫ్లాప్ తో ఇప్పుడు దిగ్గజ విశ్లేషకుడిని పచ్చ మీడియా రంగంలోకి దించింది అని, ఇక ఇప్పుడు విశాఖ నుంచి మరో జోస్యుడ్ని తయారు చేశారని ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విజయసాయిరెడ్డి , ప్రస్తుతం అతను తిరుపతి ఉప ఎన్నికల్లో గంటల పంచాంగం చెబుతున్నాడు అంటూ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో చంద్రబాబుకి తిరుపతి అంటేనే ముచ్చెమటలు పడుతున్నాయి అని, మొన్నటి పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల తీర్పుతో వచ్చిన జ్వరం ఇంకా తగ్గక ముందే బై ఎలక్షన్ వచ్చి పడిందని ఇక్కడ కూడా ఓటమి చంద్రబాబును పగబట్టినట్టు తరుముతోంది అని చంద్రబాబుపై విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు.

English summary
YCP MP Vijayasai Reddy continues to make harsh remarks targeting the opposition parties . Vijayasai Reddy has been criticizing the BJP and Janasena, The offering party does not have a seat in the state and the offered party does not exist. At least he is not an MLA but saying that he will be the CM . Moreover, Vijayasaireddy, targeted Chandrababu and made criticism
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X