రీ ఎంట్రీపై తేల్చేసిన సాయిరెడ్డి, కండీషన్స్ అప్లై - పవన్ తోనూ..!!

మాజీ ఎంపీ సాయిరెడ్డి పొలిటికల్ రీ ఎంట్రీ పై తేల్చేసారు. సాయిరెడ్డి తిరిగి వైసీపీలోకి వస్తారంటూ కొంత కాలంగా ప్రచారం సాగుతోంది. జగన్ సన్నిహిత నేతగా వ్యవహరించిన సాయిరెడ్డి పార్టీ వీడే సమయంలో ఆయన కోటరీ పైన సంచలన వ్యాఖ్యలు చేసారు. కాకినాడ పోర్టు, లిక్కర్ కేసుల్లోనూ ఓపెన్ గా తన అభిప్రాయాలను వెల్లడించారు. ఇక.. ఇప్పుడు సాయిరెడ్డి కొత్త పార్టీ ఆలోచన లేదని చెబుతూనే.. తన రీ ఎంట్రీ పై స్పష్టత ఇచ్చారు. ఇదే సమయంలో పవన్ తో అనుబంధం గురించి ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు.

మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. వైఎస్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కలిగిన సాయిరెడ్డి 2024 ఎన్నికల వరకు కీలకంగా వ్యవహరించారు. వైసీపీలో జగన్ తరువాత స్థానంలో నిలిచారు. వైసీపీ - ఢిల్లీ మధ్య అనుసంధాన కర్తగా పని చేసారు. 2024 ఎన్నికల్లో నెల్లూరు నుంచి సాయిరెడ్డిని జగన్ బరిలోకి దింపారు. ఇక, 2024 ఎన్నికల్లో పార్టీ ఓటమి తరువాత సాయిరెడ్డి వైసీపీ వీడారు. ఆ సమయంలో జగన్ కోటరీ కారణంగానే తాను పార్టీ వీడుతున్నట్లు ప్రకటించారు. తాను వ్యవసాయం చేసుకుంటానని.. రాజకీయాలకు దూరంగా ఉంటానని స్పష్టం చేసారు. కాకినాడ పోర్టు, లిక్కర్ కేసుల్లో సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయం గా సంచలనంగా మారాయి. ఆ తరువాత సాయిరెడ్డి తిరిగి వైసీపీలోకి వస్తున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. కాగా.. ఇప్పుడు సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఈ ప్రచారంపై స్పష్టత వచ్చింది.

vijaya-saireddy-clarifies-over-his-re-entry-in-politics-and-serious-comments-on-jagans-coterie

సాయిరెడ్డి మరో సారి జగన్ కోటరీ గురించి కీలక వ్యాఖ్యలు చేసారు. జగన్‌కు చెప్పేది ఒక్కటే.. అప్పుడైనా, ఇప్పుడైనా ఆయన చుట్టూ నిబద్ధతలేని వ్యక్తులున్నారని... వారి మాటలను జగన్‌ నమ్మకూడదని చెప్పిన సాయిరెడ్డి... చుట్టూ ఉన్న కోటరీ ఆయన్ను తప్పుదారి పట్టిస్తోందన్నారు. వారి వల్లే పార్టీకి దూరంగా ఉన్నానని విజయ సాయిరెడ్డి స్పష్టం చేసారు. తాను ప్రస్తుతం రాజకీయా లకు దూరంగా ఉన్నానని చెప్పారు. కొత్త పార్టీ పెట్టే ఆలోచన కానీ.. ఇతర పార్టీల్లో చేరే ఉద్దేశం కానీ లేదని క్లారిటీ ఇచ్చారు. అవసరం వచ్చినప్పుడు తిరిగి రాజకీయాల్లోకి వస్తానంటూ తన ఆలోచన ఏంటో తేల్చేసారు. జగన్‌ పార్టీని మేనేజ్‌ చేసుకోగలరని వ్యాఖ్యానించారు. గతంలో తనపై చాలా ఒత్తిడి ఉండేదని..తాను వేటికీ తలొగ్గలేదని వివరించారు. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో గత ఇరవై ఏళ్లుగా మంచి స్నేహం ఉందని చెప్పిన సాయిరెడ్డి.. తాను ఎప్పుడూ పవన్‌ను విమర్శించ లేదని గుర్తు చేసారు. అదే విధంగా సీఎం చంద్రబాబుతో ఎలాంటి వ్యక్తిగత వైరం లేదన్నారు. దీని ద్వారా.. పొలిటికల్ రీ ఎంట్రీ పై సాయిరెడ్డి తన ఆలోచన ఏంటో చెప్పకనే చెప్పేసినట్లు విశ్లేషణ లు మొదలయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+