ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ నియామకం

ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి విజయానంద్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలం డిసెంబర్ నెలాఖరుతో ముగియనుంది. ఈ క్రమంలో ఏపీ కొత్త సీఎస్‌గా విజయానంద్‌ను ప్రభుత్వం ఎంపిక చేసింది.

విజయానంద్ ప్రస్తుతం రాష్ట్ర ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. వచ్చే ఏడాది నవంబర్ నెలాఖరున ఆయన పదవీ విరమణ చేయనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఈ సీనియర్ ఏఐఎస్ అధికారివైపే మొగ్గు చూపడంతో దయానంద్ కొత్త సీఎస్‌గా ఖరారైంది.

Vijayanand appointed as new CS of Andhra Pradesh

కాగా, కె. విజయానంద్, 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి, ఫిబ్రవరి, 2022 నుంచి ఏపీ జెన్‌కోకి ఛైర్మన్‌గా, ఏప్రిల్ 2023 నుంచి ఏపీ ట్రాన్స్‌కోకు సీఎండీగా ఉన్నారు. ఏపీ జెన్‌కో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉత్పాదక సంస్థ మొత్తం శక్తి అవసరాలలో 40-45% వాటాను అందిస్తుంది.

కె. విజయానంద్ 1993లో అసిస్టెంట్‌గా భారతీయ బ్యూరోక్రసీ వృత్తిని ప్రారంభించారు. ఆదిలాబాద్ కలెక్టర్, రంపచోడవరం సబ్ కలెక్టర్, శ్రీకాకుళం కలెక్టర్, APGENCO మేనేజింగ్ డైరెక్టర్, APTRANSCO CMD 2016 నుంచి 2019 వరకు, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, ఎక్స్-అఫీషియో ప్రిన్సిపల్ సెక్రటరీగా 2019 నుంచి 2021 వరకు పనిచేశారు. ఇప్పుడు విజయానంద్ ప్రభుత్వ కార్యదర్శి, ఇంధనం స్పెషల్ చీఫ్‌గా ఉన్నారు. కాగా, ఈయన కంటే మరికొందరు సీనియర్ ఐఎస్ఎస్ అధికారులు ఉన్నప్పటికీ.. ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని విజయానంద్ ను కొత్త సీఎస్‌గా నియమించినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+