వెంటిలేటర్ పై ఉన్న టీడీపీ బూతులకు తెగబడుతుంది; బద్వేలులో మీ బతుకేంటో తేలిపోతుంది: విజయసాయి రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి నేత పట్టాభి వ్యాఖ్యలు రేపిన దుమారం అంతా ఇంతా కాదు. టిడిపి నేత పట్టాభి సీఎం జగన్మోహన్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలు,ఆ తర్వాత వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన చేసిన దాడులు, తెలుగుదేశం పార్టీ ఆందోళనలు వెరసి రాష్ట్రంలో మొదలైన రచ్చ చిలికి చిలికి గాలివానగా మారింది. తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై వైసీపీ దాడులకు నిరసనగా ఏపీ బంద్ కు పిలుపునిచ్చిన చంద్రబాబు, తాజాగా 36గంటల దీక్షకు దిగిన విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం నుండి దీక్షలో పాల్గొంటున్న చంద్రబాబుపై వైసీపీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. అటు చంద్రబాబు సైతం జగన్మోహన్ రెడ్డిని, ఏపీ డీజీపీ ని, వైసిపి నేతల తీరును టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.

రెండు వారాల్లో బద్వేలులో మీ బతుకేమిటో తేలిపోతుంది : సాయి రెడ్డి
తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు దీక్ష పై నిప్పులు చెరిగారు. జగన్ రెడ్డి గారి హుందాతనాన్ని బలహీనతగా తీసుకోవద్దని పేర్కొన్నారు. ప్రతి ఎన్నికల్లో చిత్తుగా ఓడారు అని గుర్తు చేసిన విజయసాయిరెడ్డి రెండు వారాల్లో బద్వేలులో మీ బతుకేమిటో తెలిసిపోతుందని వ్యాఖ్యానించారు. ప్రజలు దేవుడిగా ఆరాధిస్తున్న వ్యక్తిపై దిగజారుడు భాషను ఉపయోగిస్తే తోపులైపోరు అంటూ మండిపడ్డారు. బూతులు తిడుతూ రాజకీయం చేస్తే ప్రజలు హర్షించరు అని పేర్కొన్నారు. రెచ్చగొట్టే విద్వేష రాజకీయాలకు కాలం చెల్లిందని పేర్కొన్న విజయసాయిరెడ్డి తాడు బొంగరం లేని వాళ్ళే తమాషా చేస్తారంటూ తెలుగుదేశం పార్టీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

బరితెగింపుకు భారీ మూల్యం చెల్లించక తప్పదు : విజయసాయి రెడ్డి
జనం మధ్య కు వెళ్లాలి కానీ పార్టీ ఆఫీసులో ఏం పని అంటూ చంద్రబాబు తీరును ఆక్షేపించారు. సంక్షేమ పాలన చూసి ఓర్చుకోలేక అడ్రస్ గల్లంతు అవుతుందని విపక్షం అడ్డదారులు తొక్కుతోంది అంటూ నిప్పులు చెరిగారు విజయ సాయి రెడ్డి. కావాలని రెచ్చగొట్టే వారి విషయంలో క్యాడర్ అప్రమత్తంగా ఉండాలంటూ పేర్కొన్నారు. ఇదే సమయంలో రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు సహజమని అవన్నీ ప్రజల మేలు కోరుతూ వారి కేంద్రంగానే జరగాలని అభిప్రాయపడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. కానీ వెంటిలేటర్ పై ఉన్న తెలుగుదేశం పార్టీ బూతులకు తెగ పడుతుందని మండిపడ్డారు. ఈ బరితెగింపుకు భారీ మూల్యం చెల్లించక తప్పదు అంటూ విజయ సాయి రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.

చంద్రబాబుకు లోకేష్ కు చీపురు దెబ్బలు తప్పవు : మంత్రి శ్రీరంగ నాథ రాజు
చంద్రబాబు దీక్షకు కౌంటర్ గావైసిపి జనాగ్రహదీక్షలో పాల్గొన్నమంత్రి శ్రీరంగనాథరాజు చంద్రబాబునాయుడు అండతోనే పట్టాభి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి పై అనుచిత వ్యాఖ్యలు చేశాడని అభిప్రాయపడ్డారు.ముఖ్యమంత్రిపై పట్టాభి చేసిన వ్యాఖ్యల వల్లే దాడులు జరిగాయని పేర్కొన్నారు.సంక్షేమ పథకాలకు ప్రజల్లో వస్తున్న ఆదరణచూసి అక్కసుతోనే చంద్రబాబు పట్టాభితో అనుచిత వ్యాఖ్యలు చేయించాడనిఆరోపించారు మంత్రి శ్రీ రంగనాథ రాజు.కోర్టులో కేసులు వేయించి చంద్రబాబు పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలను కూడా నిలుపుదల చేశారని,పేదల ఇళ్ల నిర్మాణాలను అడ్డుకున్న చంద్రబాబుకు త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. చంద్రబాబు తీరు మార్చుకోకపోతే చంద్రబాబుకు ఆయన కుమారుడు లోకేష్ కు చీపురు దెబ్బలు తప్పవని మంత్రి వార్నింగ్ఇచ్చారు.అవసరానికి పార్టీలను వాడుకుని వదిలేసే మనస్తత్వంచంద్రబాబుకు ఉందన్నారు మంత్రి శ్రీరంగనాథరాజు.

మంగళగిరిలో లోకేష్ కు తన్నులే : మంత్రి జయరాం
ఇదిలా ఉంటే టిడిపి నేతలపై కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.సీఎం జగన్ నువిమర్శిస్తేతెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తామని గుమ్మనూరు జయరాం హెచ్చరించారు టిడిపి నేత పట్టాభి పోగొట్ట అన్నాడని మంత్రిజయరాం వ్యాఖ్యానించారు.బ్రాహ్మణ కులంలో పుట్టిన నీచమైన మాటలు మాట్లాడుతున్నాడనిమంత్రి జయరాం నిప్పులు చెరిగారు.పట్టాభి మీడియాలో మాట్లాడాడు కాబట్టి సరిపోయిందని,అదే జనాల్లో మాట్లాడితేమహిళలే ముక్కలు ముక్కలుగా చేసే వాళ్ళనిమంత్రి జయరాం వ్యాఖ్యానించారు.చంద్రబాబుకు మతిభ్రమించింది అని రెండున్నర ఏళ్ల పాలనలో సంక్షేమ పథకాలు చూసి ఓర్చుకోలేక చంద్రబాబు మాటల దాడులు చేస్తున్నారనిజయరాంమండిపడ్డారు.జగన్మోహన్ రెడ్డిని తిట్టడం చంద్రబాబు పనిగా పెట్టుకున్నారనివిమర్శించినమంత్రి జయరాం నారా లోకేష్ కు జయంతి కి వర్ధంతి కి తేడా తెలియదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలో లోకేష్ నుకొట్టాలన్నారు జయరాం.
Recommended Video

బూతులు తిట్టిన వారిని చంద్రబాబు వెనకేసుకొస్తారా : మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి
ఇక చంద్రబాబు డైరెక్షన్లోనే పట్టాభి బూతులు మాట్లాడుతున్నాడని మంత్రి బాలినేని మండిపడ్డారు. చంద్రబాబు బ్రతుకంతా కుట్రల మయం అని పేర్కొన్న మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి చంద్రబాబు దొంగ దీక్షలు చేస్తున్నారని విమర్శించారు పట్టాభి అసభ్య పదజాలాన్ని చంద్రబాబు వెనకేసుకు వస్తారా అంటూ ప్రశ్నించారు. ఏపీలో కుట్రలు కుతంత్రాలు చేస్తామంటే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. గతంలో మతవిద్వేషాలు రెచ్చగొట్టడానికి టీడీపీ నేతలు రధాలు తగలబెట్టించారని , ఎప్పుడూ ఏదో ఒక ఉద్రిక్తత సృష్టించడమే తెలుగుదేశం పార్టీ నేతల పని అని మంత్రి బాలినేని విమర్శించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణ చెప్పాల్సింది పోయి ఎదురుదాడికి దిగడం హేయమైన చర్య అని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications