వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబును కరోనా మహమ్మారితో పోలుస్తూ విజయసాయిరెడ్డి సెటైర్లు

|
Google Oneindia TeluguNews

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కరోనావైరస్ మహమ్మారితో పోలుస్తూ సెటైర్లు వేశారు. కరోనావైరస్‌లానే చంద్రబాబు కూడా.. రోజుకో వేరియంట్‌గా మారుతున్నాడని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు.

'కరోనా వైరస్ లాగానే చంద్రబాబు రోజుకో తీరు మారుతున్నాడు. ప్రజలను ఇబ్బంది పెట్టడానికి చంద్రబాబు కొత్త వేరియంట్‌‌లా మారుతున్నాడు. బాబూ, నీది మీటర్ గేజ్ పై తిరిగే రైలు. ఈ రెండేళ్లలో రాష్ట్రమంతా గేజి మార్పిడి జరిగి బ్రాడ్ గేజ్ అందుబాటులోకి వచ్చింది. అయినా ఈ పట్టాల మీదే తిప్పుతా అంటే రైలు అక్కడే కూరుకుపోతుంది. దానిని అలా వదిలేస్తే మంచిదనే అభిప్రాయానికి వచ్చారు ప్రజలు. వ్యర్థ తాపత్రయాలు మానుకో' అంటూ విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

YSRCP MP vijayasai reddy compares chandrababu naidu with coronavirus.

'బాబు ఒక వాస్తవాన్ని కావాలనే మర్చిపోయినట్టు నటిస్తున్నాడు. తన అక్రమాలకు దన్నుగా నిల్చిన వారిని కాపాడుకోవడానికి, పెంచి పోషించిన వ్యవస్థలను ఇప్పటికీ మ్యానేజ్ చేస్తూ ఉండవచ్చు. కానీ అధికారం రావాలంటే ఈ వ్యవస్థలు, రోజుకు కోటి ఫీజు తీసుకునే లాయర్ల సాయం సరిపోదు. ప్రజలు కోరుకోవాలి' అంటూ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.

'వచ్చే సార్వత్రక ఎన్నికలనాటికి బిజెపి (రానిచ్చినా) వెంట ఉంటాడనే నమ్మకం ఏమీ లేదు. ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి రాదని అనుమానం వస్తే అంతకు ముందు వదిలేసి వచ్చినోళ్ల కాళ్లు పట్టుకుంటాడు. బాబుకు ఇప్పుడు కావాల్సింది అధికారం కాదు. ఆస్తులు కాపాడుకోవడం, అరెస్టుల నుంచి తప్పించుకోవడం' అని విజయసాయి విమర్శించారు.

Recommended Video

APSFL To Expand Services, రాబోయే రోజుల్లో 8608 కనెక్షన్లు || Oneindia Telugu

గతంలో పోలింగ్ బూత్ వారీగా కమిటీలున్న పార్టీ తమదొక్కటే అని గొప్పలకు పోయాడు బాబు. అయినా వరస ఎన్నికల్లో చిత్తయ్యాడు. ఇప్పుడు 50 ఇళ్లకో కార్యకర్తను నియమిస్తాడట. జన్మభూమి ముసుగులో పచ్చ బ్యాచ్ సాగించిన అరాచకాలను ప్రజలు ఎన్నటికీ మరిచిపోరంటూ విజయసాయి ధ్వజమెత్తారు.

English summary
YSRCP MP vijayasai reddy compares chandrababu naidu with coronavirus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X