బాబు గారూ మీకు అర్థమవుతోందా..! వైసీపీ డిమాండ్ తో సాయిరెడ్డి పంచ్..!

ఏపీ రాజకీయాల నుంచి గతేడాది విరమించుకున్నట్లు ప్రకటించి, ఆ తర్వాత తిరిగి సోషల్ మీడియాలో యాక్టివ్ అయిపోయిన వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy).. ఇప్పుడు నిత్యం తన ట్వీట్లతో హల్ చల్ చేస్తున్నారు. ఇదే క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందు పలు డిమాండ్లు పెడుతున్నారు. ఇవాళ ఏపీలో సీఎం చంద్రబాబు (Chandrababu) ముందు సాయిరెడ్డి ఓ కీలక డిమాండ్ పెట్టారు. ఈ డిమాండ్ ను ఇప్పటికే ఆయన మాజీ పార్టీ వైసీపీ రాష్ట్రంలో వినిపిస్తున్న వేళ దీనిపై చర్చ జరుగుతోంది.

ఏపీలోనూ విజయ్ తరహా పార్టీ ? టీడీపీ, వైసీపీకి చెక్ పెట్టాలన్న సాయిరెడ్డి..!
ఏపీలోనూ విజయ్ తరహా పార్టీ ? టీడీపీ, వైసీపీకి చెక్ పెట్టాలన్న సాయిరెడ్డి..!

అమెరికా-ఇరాన్ యుద్దాన్ని కారణంగా చూపుతూ దేశవ్యాప్తంగా కేంద్రం తాజాగా పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచింది. పెట్రోల్ పై 3 రూపాయలు, డీజిల్ పై 2 రూపాయలు పెంచింది. దీంతో ఏపీలో ఇప్పటికే ఎక్కువగా ఉన్న పెట్రోల్ ధర కాస్తా ఇప్పుడు మరింత పెరిగింది. తాజా పెంపు తర్వాత ఏపీలో పెట్రోల్ ధర దేశంలోనే అత్యధికంగా రూ.113కు చేరుకుంది. దీనిపై చంద్రబాబుకు హెచ్చరికలు చేస్తూ సాయిరెడ్డి ఇవాళ ఓ ట్వీట్ చేశారు. ఇందులో ఆయన పలు కీలక విషయాల్ని ప్రస్తావించారు.

Vijayasai Reddy Demands Petrol Price Cut as AP Hits Rs 113 Litre Highest in India
3 రూపాయలకే గగ్గోలా ? పెట్రోల్ ధర పెంపుపై సాయిరెడ్డి షాకింగ్..!
3 రూపాయలకే గగ్గోలా ? పెట్రోల్ ధర పెంపుపై సాయిరెడ్డి షాకింగ్..!

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్ ధరలు లీటరుకు ₹113కి పెరిగాయని, ఇది భారతదేశంలోనే అత్యధికమని విజయసాయిరెడ్డి తెలిపారు. దీనివల్ల జీవన వ్యయం పెరగడమే కాకుండా, ఆదాయ లీకేజీ కూడా జరుగుతోందన్నారు. ఎందుకంటే, సరిహద్దు జిల్లాల సమీపంలోని చాలా మంది వాహన యజమానులు తక్కువ ధరలు ఉండే పొరుగు రాష్ట్రాల్లో ఇంధనం నింపుకోవడానికి ఇష్టపడుతున్నారని తెలిపారు. ప్రజలకు కొంత ఉపశమనం కలిగించేందుకు, పెట్రోల్ ధరలను కనీసం పొరుగు రాష్ట్రాల ధరలకు సమానంగా తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ మధ్యే కేంద్రం పెట్రోల్ ధరల్ని నామమాత్రంగా 3 రూపాయలే పెంచిందని, ఇది సరిపోదని ఇదే సాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఇప్పుడు వైసీపీ డిమాండ్ ను ముందుపెట్టి చంద్రబాబును ధరలు తగ్గించాలంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+