వైఎస్సార్ జయంతి వేళ.. తెరపై సాయిరెడ్డి: ప్రజా సేవ దిశగా..

Dr YSR Jayanti: నేడు- దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి 76వ జయంతి. ఈ సందర్భంగా కుటుంబ స‌భ్యులు ఘ‌నంగా నివాళి అర్పించారు. ఈ ఉదయం కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్‌ ఘాట్‌ వద్ద ఆయన సతీమణి వైఎస్‌ విజయమ్మ, వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, ఆయన భార్య వైఎస్ భారతి నివాళి అర్పించారు.

వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వైఎస్ జగన్.. సోమవారం సాయంత్రమే తాడేపల్లి నుంచి ఇడుపులపాయకు చేరుకున్న విషయం తెలిసిందే. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం ఇడుపులపాయకు చేరుకున్నారు. రాత్రి అక్కడే బస చేశారు.

Vijayasai Reddy pays tribute to Dr YSR on his birth anniversary

ఈ ఉదయం వైఎస్సార్ ఘాట్ వద్దకు చేరుకున్నారు. అక్కడే ఉన్న విగ్రహానికి పూలమాల వేశారు. వైఎస్‌ విజయమ్మ, భారతితో కలిసి నివాళి అర్పించారు. సమాధిపై పూలమాలను ఉంచి మౌనం పాటించారు. ఆ సమయంలో జగన్ వెంట కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు.

జగన్ నివాళి అర్పించి వెళ్లిన తరువాత ఆయన చెల్లెలు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ వైఎస్ షర్మిల.. ఘాట్ వద్దకు చేరుకున్నారు. తండ్రికి నివాళి అర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం కోసం వైఎస్సార్ తన జీవితాన్ని అంకితం చేశారని, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన దార్శనికుడని స్మరించుకున్నారు. అచంచల నిబద్ధత, నిస్వార్థ సేవకు వైఎస్సార్ చిరకాలం గుర్తుంటారని అన్నారు.

వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని రాజ్యసభ మాజీ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి ఆయనకు నివాళి అర్పించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఆయనకు హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నానని అన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలతో ఉమ్మడి ఏపీలో పేదలకు గౌరవప్రదమైన జీవితాన్ని వైఎస్సార్ అందించారని అన్నారు.

తన హయాంలో ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రవేశపెట్టి రైతులకు సరికొత్త ఆశలను కల్పించారని సాయిరెడ్డి అన్నారు. పేదవాడికి ఉచితంగా కార్పొరేట్ వైద్య సదుపాయాన్నికల్పించిన మహనీయుడని, ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలను, అభివృద్ధి ఫలాలను అందించిన అసాధారణ నాయకుడని చెప్పారు. ఆయన దార్శనిక నాయకత్వం మనల్ని ప్రజా సేవ చేయడానికి ప్రేరేపిస్తూనే ఉంటుందని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+