కేంద్ర బడ్జెట్ పైన పటారం లోన లొటారం; కేంద్ర విధానాలతో ఏపీకి అన్యాయం: విజయసాయిరెడ్డి

కేంద్ర ప్రభుత్వం మంగళవారంనాడు ప్రవేశపెట్టిన బడ్జెట్ పై దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీల నుండి అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇక తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. బడ్జెట్ ఆశాజనకంగా లేదని, పైకి అంకెలు చూడడానికి బాగున్నా, ఉపయోగకరమైన బడ్జెట్ లా అనిపించడం లేదని విజయసాయి రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్ పైన పటారం లోన లొటారంలాగా ఉందని పేర్కొన్నారు.

కేంద్ర ఆర్థిక శాఖ ఫార్ములాతో ఏపీకి అన్యాయం

కేంద్ర ఆర్థిక శాఖ ఫార్ములాతో ఏపీకి అన్యాయం

బడ్జెట్ కరోనా బూస్టర్ డోస్ తరహాలో ఆశాజనకంగా ఉంటుందని భావించామని, కానీ ఆ విధంగా లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర ఆర్థిక శాఖ ఫార్ములాతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని విజయసాయి రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. పన్నుల వాటాలలో ఏపీ కి వచ్చేది నాలుగు వేల కోట్లు మాత్రమే అని పేర్కొన్న విజయసాయిరెడ్డి కేంద్రం తీరుపై పెదవి విరిచారు.

మూలధన వ్యయంలో రాష్ట్రాల కేటాయింపుల్లో కేంద్ర విధానాలతో నష్టం

మూలధన వ్యయంలో రాష్ట్రాల కేటాయింపుల్లో కేంద్ర విధానాలతో నష్టం

మూలధన వ్యయంలో రాష్ట్రాలకు కేటాయింపును రూ.15 వేల కోట్ల నుంచి రూ.లక్ష కోట్లకు పెంచడం స్వాగతించదగిందే అయినా అది రాష్ట్రాలకు పంచేటప్పుడు కేంద్రం అవలంభిస్తున్న విధానం వల్ల ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరుగుతోందని వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ విధానం వల్ల రూ.లక్ష కోట్లలో ఏపీకి వచ్చేది కేవలం 4.047 శాతమే అని స్పష్టం చేశారు.

కేంద్ర బడ్జెట్ లో 2020-21 లో ద్రవ్య లోటు 9.3 శాతంగా ఉందని ఆయన అన్నారు. 2021-22లో 6.9 శాతం గా ఉందని పేర్కొన్నారు. 2022-23 అంచనా 6.4 శాతం అని వెల్లడించారు . ఏపీ విషయానికి వస్తే 2020-21 లో ద్రవ్య లోటు 5.38 శాతం గా ఉందని తెలిపారు. 2021-22లో 3.49 శాతం అని విజయసాయిరెడ్డి వెల్లడించారు.

ఎఫ్ఆర్ బీఎం పరిధి దాటుతోన్న కేంద్రం, రాష్ట్రాలను మాత్రం దాటవద్దని చెప్తుంది

ఎఫ్ఆర్ బీఎం పరిధి దాటుతోన్న కేంద్రం, రాష్ట్రాలను మాత్రం దాటవద్దని చెప్తుంది

ఎఫ్ఆర్బీఎం విషయంలో కేంద్రానికి ఉన్న వెసులుబాటు రాష్ట్రాలకు కల్పించకపోవడం సరికాదు అంటూ విజయసాయి రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎఫ్ఆర్ బీఎం పరిమితి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక్కటేనని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. తాను ఎఫ్ఆర్ బీఎం పరిధి దాటుతోన్న కేంద్రం, రాష్ట్రాలను మాత్రం ఎఫ్ఆర్‌బీఎం పరిధి దాటరాదని చెబుతోందని విమర్శించారు.

ఎఫ్ఆర్‌బీఎంపై కేంద్ర ప్రభుత్వానివి ద్వంద్వ ప్రమాణాలు అని విజయసాయిరెడ్డి ఆరోపించారు.కేంద్రానికి ఒక న్యాయం, రాష్ట్రాలకు మరో న్యాయమా అని ప్రశ్నించారు.

నదుల అనుసంధానానికి వెచ్చించిన ఖర్చును రాష్ట్రానికి చెల్లించాలి

నదుల అనుసంధానానికి వెచ్చించిన ఖర్చును రాష్ట్రానికి చెల్లించాలి

దాదాపు రూ.40 లక్షల కోట్లకు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ గత సంవత్సరం కంటే 4.6లక్షల కోట్ల కంటే అధికంగా ఉందని పేర్కొన్నారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. ఇది స్వాగతించాల్సిన అంశం అని అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే ఈ కరోనా కష్ట సమయంలో 9.2 శాతం వృద్ధి రేటు అభినందనీయం అని పేర్కొన్నారు విజయసాయిరెడ్డి .ఇక ఇదే సమయంలో రొయ్యల ఉత్పత్తి పై పన్ను తగ్గింపులు స్వాగతిస్తున్నామని, నదుల అనుసంధాన ప్రక్రియను ఆహ్వానిస్తున్నామని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వెల్లడించారు.

గోదావరి-కృష్ణా, కృష్ణా-పెన్నా అనుసంధానం పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొంతమేర ఖర్చు చేసిందన్నారు. ఆ ఖర్చును తిరిగివ్వాలని పేర్కొన్నారు. ఇక నదుల అనుసంధానానికి వెచ్చించే ఖర్చును రాష్ట్రానికి చెల్లించాలని విజయసాయి రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Recommended Video

    Telangana Govt వెంటనే కొత్త Ration Cards జారీ చేయ్యాలి - Kotla Srinivas | Oneindia Telugu
    విశాఖ ఉక్కు, ఎల్‌ఐసీ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నామన్న సాయిరెడ్డి

    విశాఖ ఉక్కు, ఎల్‌ఐసీ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నామన్న సాయిరెడ్డి

    పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని కోరుతున్నామని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ధాన్యం సేకరణకు స్పష్టమైన పాలసీ లేదని అభిప్రాయపడ్డారు. విశాఖ ఉక్కు, ఎల్‌ఐసీ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నామని వెల్లడించారు. ఇక ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలువురు ప్రతిపక్ష పార్టీల నేతలు బడ్జెట్ పై విమర్శలు గుప్పించారు. ఇక తెలంగాణా సీఎం కేసీఆర్ అయితే కేంద్ర బడ్జెట్ ను తూర్పారబట్టారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+