వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ ను నితిన్ గడ్కరీ మెచ్చుకోవటం ఐదుకోట్లమంది ఆంధ్రులకు దక్కిన గౌరవం: విజయసాయి రెడ్డి

|
Google Oneindia TeluguNews

రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటుగా, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మెచ్చుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయవాడ పర్యటనలో సీఎం జగన్ ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మెచ్చుకోవడం పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తన స్పందన తెలియజేశారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

 సీఎం జగన్ ను నితిన్ గడ్కరీ మెచ్చుకోవటం మామూలు విషయం కాదు

సీఎం జగన్ ను నితిన్ గడ్కరీ మెచ్చుకోవటం మామూలు విషయం కాదు

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సాధారణంగా మితభాషి అని, ఆయనకు పొగడ్తలంటే గిట్టవు అని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. అందుకే ఆయన ఎవరినీ ప్రశంసించిన దాఖలాలు ఉండవని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. అలాంటి నితిన్ గడ్కరీ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని మెచ్చుకోవడం మామూలు విషయం కాదని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఏదైనా సాధించగల గట్టి ఆశయాలున్న డైనమిక్ లీడర్ జగన్ అని నితిన్ గడ్కరీ మెచ్చుకోవడం ఐదు కోట్ల మంది ఆంధ్రులకు దక్కిన గౌరవం అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 20 ఆర్వోబీలు కావాలని కోరితే 30 ఇస్తామని గడ్కరీ చెప్పడం మామూలు విషయం కాదని విజయ సాయి రెడ్డి వెల్లడించారు.

భారతీయ ఎంపీల ప్రతిష్ట గురించి సింగపూర్ ప్రధాని వ్యాఖ్యలపై సాయిరెడ్డి

భారతీయ ఎంపీల ప్రతిష్ట గురించి సింగపూర్ ప్రధాని వ్యాఖ్యలపై సాయిరెడ్డి

ఇదే సమయంలో సింగపూర్ ప్రధాని లీ హైసెన్ లూంగ్ భారతీయ ఎంపీల ప్రతిష్ట గురించి చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరం అని పేర్కొన్నారు. అలాంటి వ్యాఖ్యలు స్వయంగా ఒక ప్రజా ప్రతినిధి నుండి రావడం మరింత బాధాకరం. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ దీనికి వ్యతిరేకంగా నిరసన తెలియజేయడం ద్వారా భారతదేశం సరైన చర్య తీసుకుంది అంటూ వ్యాఖ్యానించారు ఎంపీ విజయసాయిరెడ్డి.

 ఉక్రెయిన్ లో ఏపీ విద్యార్థులకు ఎన్నారైలు సహాయం చెయ్యండి

ఉక్రెయిన్ లో ఏపీ విద్యార్థులకు ఎన్నారైలు సహాయం చెయ్యండి

అంతేకాదు ఉక్రెయిన్‌లో తీవ్ర ఉద్రిక్తతల మధ్య, అనేక మంది ఆంధ్ర విద్యార్థులు ఘర్షణలో చిక్కుకున్నారని నాకు తెలిసిందని విజయసాయి రెడ్డి వెల్లడించారు. ఏపీ ప్రభుత్వ APNRTS మరియు వైసిపి యొక్క ఎన్నారై విభాగం అవసరమైన వారికి సహాయం చేయబోతున్నాయని పేర్కొన్నారు. ఈ కష్ట సమయాల్లో సహాయం చేయడానికి ముందుకు రావాలని ఎన్నారైలను నేను అభ్యర్థిస్తున్నాను అని పేర్కొన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి.

Recommended Video

AP Highway Projects కి Nitin Gadkari, AP CM Jagan శంకుస్థాపన| Benz Flyover-2 | Oneindia Telugu
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవసరం ఏముంది?

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవసరం ఏముంది?


అంతకుముందు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం ఏముందని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు విజయసాయిరెడ్డి. ఈ మేరకు ట్వీట్ చేసిన ఆయన ఇప్పటికే లాభాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిలో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ఇది 2006లో దాని మునుపటి రికార్డు 13,325 టన్నులను అధిగమించి 15,230 టన్నుల రికార్డు ఉత్పత్తిని సాధించింది. దీని కోసం తాను కార్మికులందరినీ అభినందిస్తున్నాను అని ఆయన పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాల్సిన అవసరం ఎక్కడుంది అని కేంద్రాన్ని ప్రశ్నించారు.

English summary
Rajya Sabha member Vijayasai Reddy opined that it was not a common thing for Union Minister Nitin Gadkari to praise AP CM Jagan Mohan Reddy and that it was an honor bestowed on five crores Andhra people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X