ఎల్లుండే.. ప్రెస్ ముందుకు సాయిరెడ్డి: బిగ్ అనౌన్స్‌మెంట్ గ్యారెంటీ?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ మాజీ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి తెర మీదికి వచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ నెల 7వ తేదీన విజయవాడలో ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. మీడియా ముందుకు రాబోతోన్నారు. భవిష్యత్ రాజకీయ గమనం, కార్యాచరణ ప్రణాళికపై ఆయన కీలక ప్రకటనలు చేయనున్నారు. ఎల్లుండి మధ్యాహ్నం 1:15 నిమిషాలకు విజయవాడలోని లెమన్ ట్రీ ప్రీమియర్ హోటల్ లో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటైంది.
నూతన పార్టీని త్వరలోనే ప్రకటిస్తానంటూ ఇదివరకే వెల్లడించారు సాయిరెడ్డి. దీంతో ఆయన ఏర్పాటు చేసిన ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పై అందరి చూపూ నిలిచింది. ఎలాంటి ప్రకటన చేయబోతోన్నారనేది ఇప్పటి నుంచే హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో తెలుగుదేశం- జనసేన- బీజేపీ కూటమి కట్టాయి. వైఎస్ఆర్సీపీ ఒంటరిపోరాటం సాగిస్తోంది. వామపక్షాలు, ఇతర చిన్నా చితక పార్టీలు ఉన్నా వాటి ప్రభావం అంతంత మాత్రమే.

ఈ పరిస్థితుల్లో ద్విపార్టీ రాజకీయాలు సామాన్య ప్రజల ఆశయాలు, వారి దీర్ఘకాలిక ప్రయోజనాలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని సాయిరెడ్డి చెబుతున్నారు. ఈ రకమైన రాజకీయాలు ప్రజల అభీష్టాన్ని సరిగ్గా ప్రతిబింబించడం లేదని అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో ఏపీలో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ తెరమీదికి రావాల్సిన అవసరం ఉందంటూ విజయసాయిరెడ్డి తాజాగా ఓ ట్వీట్ పోస్ట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ప్రస్తుతం కొనసాగుతున్న సాంప్రదాయ రాజకీయ సమీకరణాలకు భిన్నంగా సామాన్య ప్రజలు మరియు వారి శ్రేయస్సును కేంద్రంగా ఉంచుకుని సాగే నూతన ప్రత్యామ్నాయం అవసరమని తేల్చి చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల అవసరాలను తీర్చడం, వారి సమస్యల పరిష్కారించడమే పరమావధిగా పాలన సాగాలని అన్నారు.
వైఎస్సార్సీపీలో నంబర్ 2 గా, పార్టీ గళాన్ని జాతీయ స్థాయిలో బలంగా వినిపించిన నేతగా గుర్తింపు ఉన్న విజయసాయి రెడ్డి.. ద్విపార్టీ విధానం విఫలమైందంటూ విమర్శలు గుప్పించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమౌతోంది. ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు ఉంచడానికి ఓ నూతన పార్టీని, భవిష్యత్ కార్యాచారణ ప్రణాళికలను ప్రకటించబోతున్నారా అనే చర్చ జరుగుతోంది.
PRESS INVITATION
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 5, 2026
I will be addressing the press in Vijayawada on 7th September to discuss the various problems being faced by the common people of Andhra Pradesh.
The press meet will also focus on how the prevailing two-party political model is failing to reflect the will,… pic.twitter.com/UwjScPq8Sp













Click it and Unblock the Notifications