ఐటీ రిటర్న్ లో భార్యా భర్తల ఆఫర్..! నిర్మలమ్మకు సాయిరెడ్డి డిమాండ్..!
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వైసీపీ మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి (VijayaSai Reddy) సలహాలు, డిమాండ్ల పరంపర కొనసాగుతోంది. ఇదే క్రమంలో సాయిరెడ్డి ఇవాళ కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ముందు ఓ కీలక డిమాండ్ పెట్టారు. ఆదాయపు పన్ను రిటర్న్ ల దాఖలు విషయంలో ఆర్థికమంత్రిని ఓ వెసులుబాటు కల్పించాలని సాయిరెడ్డి కోరారు. స్వయంగా ఆడిటర్, ఛార్టర్డ్ అకౌంటెంట్ కూడా అయిన సాయిరెడ్డి చేసిన ఈ డిమాండ్ ప్రాధాన్యం సంతరించుకుంది.
వివాహిత జంటల కోసం "ఉమ్మడి ఆదాయపు పన్ను దాఖలు" (Joint ITR filing) విధానాన్ని ప్రవేశపెట్టడాన్ని ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ పరిశీలించాలని విజయసాయిరెడ్డి కోరారు. దీనివల్ల భార్యాభర్తలు ఒకే రిటర్న్ దాఖలు చేసి, అర్హత గల మినహాయింపులను కలిపి చూపడానికి వీలవుతుందని ఆయన తెలిపారు. ఆర్థిక బాధ్యతలు ఎంతో భిన్నంగా ఉన్నప్పటికీ, ₹15 లక్షలు సంపాదించే వ్యక్తికి, అంతే సంపాదించే ఒకే ఆదాయం గల కుటుంబానికి ఒకే విధంగా పన్ను విధించడం అన్యాయమని సాయిరెడ్డి వెల్లడించారు.

Hon’ble FM @nsitharaman garu should consider introducing “joint income-tax filing” for married couples, allowing spouses to file a single return and pool eligible deductions. It is unfair that an individual earning ₹15 lakh and a single-income household earning the same amount…
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 28, 2026
మన పన్నుల వ్యవస్థ కుటుంబ బాధ్యతలను, గృహ వాస్తవాలను మరింత మెరుగ్గా ప్రతిబింబించాలంటూ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ను ఉద్దేశించి చేసిన ట్వీట్ లో సాయిరెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే జీఎస్టీ సహా పలు పన్ను విధానాల్లో సంస్కరణల విషయంలో తరచుగా స్పందిస్తూ సలహాలు ఇస్తున్న వైసీపీ మాజీ ఎంపీ... భార్యాభర్తలకు ఒకే రిటర్న్ ఫైల్ చేసే అవకాశం కల్పించాలని కోరడం చర్చనీయాంశమవుతోంది. సాయిరెడ్డి డిమాండ్ పై నిర్మలా సీతారామన్ ఎలా స్పందిస్తారో చూడాలి.












Click it and Unblock the Notifications