• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కేశినేని మీరు మారాలి అన్న విజయసాయి.. జైలుకెళ్ళిన వాళ్ళే మారాలి నాలాంటి మచ్చలేనివాళ్ళు కాదు అన్న నానీ

|

ఏపీ రాజకీయాల్లో విజయవాడ ఎంపీ కేశినేని నాని చేస్తున్న వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా సంచలనాలకు తెర తీసిన కేశినేని నాని తాజాగా చేస్తున్న పోస్ట్ లు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. నిన్నటిదాకా విజయసాయి రెడ్డి మాత్రమే అనుకుంటే ఇప్పుడు నానీ కూడా విజయసాయికి పోటీగా సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెట్టేస్తున్నారు. విజయసాయికి కూడా ఘాటుగా బదులిస్తున్నారు.

అమరావతిని కూల్చేద్దాం.. హైదరాబాద్‌ను అభివృద్ధి చేద్దాం అని కేశినేని పోస్ట్ .. స్పందించిన విజయసాయి

టీడీపీ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్ వేదికగా అధికార వైసీపీపై ఓ రేంజ్‌లో సెటైర్లు వేస్తున్నారు. ప్రజావేదిక కూల్చివేత తర్వాత టీడీపీ నేతలు ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు. ఇటీవల తాజ్ మహల్ కృష్ణా నది ఒడ్డున ఉంటే కూల్చివేస్తారేమో అన్నట్టుగా ఓ పోస్ట్ చేసి అలజడి రేపిన కేశినేని నాని తాజాగా ఆయన మరో పోస్ట్ చేశారు. అమరావతిని కూల్చేద్దాం.. హైదరాబాద్‌ను అభివృద్ధి చేద్దాం.. అంటూ ఆయన ఓ పోస్టు పెట్టారు. దీనిపై కేశినేని మీరు మారాలి అంటూ విజయ సాయి చేసిన ట్వీట్ పై కేశినేని చాలా ఘాటుగా వ్యాఖ్యలు చేశారు .

కేశినేని గారూ ఇకనైనా మారండి అన్న విజయసాయి

కేశినేని గారూ ఇకనైనా మారండి అన్న విజయసాయి

మొన్నటికి మొన్న ప్రజావేదిక కూల్చివేత గురించి స్పందించిన కేశినేని నానీ తాజ్ మహల్ యమునానదీ తీరాన ఆగ్రా లో ఉంది కాబట్టి సరిపోయింది .తాజ్ మహల్ కృష్ణా నదీ తీరాన ఉండి ఉంటే అంటూ పోస్ట్ చేసిన నానీ నిన్నటికి నిన్న సీఎం జగన్ , తెలంగాణా సీఎం కేసీఆర్ తో కలిసి నడుస్తున్న తీరును చూసి మరో షాకింగ్ పోస్ట్ చేశారు. టీడీపీ ఎంపీ కేశినేని నాని అమరావతిని కూల్చేద్దాం.. హైదరాబాద్‌ను అభివృద్ధి చేద్దాం.. అంటూ ఆయన ఓ పోస్టు పెట్టారు. ఇక ఈ నేపధ్యంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి "కేశినాని గారూ ఇకనైనా మారండి. మీ అధినేత బిజెపిని సమర్థిస్తే అందరూ జై కొట్టాలి. యూ-టర్ను తీసుకుని కాంగ్రెస్ గుంపులో చేరితే అది గొప్ప నిర్ణయమనాలి. తెలంగాణ సీఎంతో ఘర్షణ వైఖరి అవలంబిస్తే మేమూ అదే చేయాలా? యుద్ధం ఎప్పుడు చేయాలో, సామరస్యంగా ఎప్పుడు మెలగాలో మా సీఎం గారికి తెలుసు" అంటూ విజయసాయి కేశినేనికి తన పోస్ట్ ద్వారా హితవు పలికారు. ఇక అంతేకాదు తాను నివాసం ఉంటున్న ఇంటికి నోటీసులు ఇవ్వడం, నారావారిపల్లె ఇంటికి భద్రతను తగ్గించడంపైనే పార్టీ నేతల సమావేశంలో చర్చించి సంతాప తీర్మానం చేశారని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు . టీడీపీ నేతల సమస్యలే ప్రజా సమస్యలా అంటూ ప్రశ్నించారు.

సీబీఐ, ఈడీ చార్జీషీట్లలో పేర్లున్నవారు, జైలుకు వెళ్ళిన వారు మారాలి నాలాంటి ఏ మచ్చా లేని వాళ్ళు కాదు అన్న నానీ

ఇక దీంతో కేశినేని చాలా ఘాటుగా స్పందించారు. సీబీఐ, ఈడీ చార్జీషీట్లలో పేర్లున్నవారు, అవినీతి ఆరోపణలతో జైలుకు వెళ్లి వచ్చిన వారా నాకు మారాలని చెప్పేది.. మారాల్సింది వారే నాలాంటి స్వచ్చమైన వ్యక్తులు, ఏ మచ్చా లేని నాయకులు కాదు అంటూ ఘాటుగా విజయసాయిరెడ్డికి కౌంటరిచ్చారు. ఇక వీరి మధ్య ఈ వార్ ముందు ముందు ఇంకెలా సాగనుందో .

English summary
War runs as a social media platform in AP. vijaya sai tweeted about nani "If your leader is supporting the BJP, everyone should say Jai to BJP .If take the U-turn and join the Congress, it must be a great decision. Do you do the same if Telangana CM adopts a confrontational attitude? , "Our CM knows when to do war and when to be in harmony."vijaya sai reddy said to change the aattitude of keshineni nani mentioned in a post . Kesineni responded very seriously. Those who have been named in the CBI and the ED chargesheet, go to jail on charges of corruption they need to change, not clean people like me posted keshineni nani .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more