Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేసీఆర్ సర్కారుకు విజయశాంతి హెచ్చరిక: అహంకారాన్ని దించుతారంటూ జితేందర్ రెడ్డి విమర్శలు

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు బీజేపీ నేత, ఫైర్‌బ్రాండ్ విజయశాంతి. హైందవ ధర్మ పరిరక్షణ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ గోముఖ వ్యాఘ్రంలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. నికార్సైన హిందువునని చెప్పుకుంటూ హైందవ ధర్మానికే కళంకం తెచ్చేలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.

గోవధ చేస్తామంటూ వినతి పత్రాలా?: విజయశాంతి

గోవధ చేస్తామంటూ వినతి పత్రాలా?: విజయశాంతి

'చట్టాలను కాపాడవలసిన రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉండి... గోవధ నిషేధ చట్టానికి శఠగోపం పెడుతున్నారు. లోక్‌సభ, శాసనసభ సభ్యులుగా మీ సయామీ ట్విన్ పార్టీ ఎంఐఎం నేతలు చట్ట విరుద్ధంగా బక్రీద్ రోజున గోవధ చేస్తామంటూ డీజీపీకి వినతి పత్రం ఇస్తే మీరు చూస్తూ ఊరుకున్నారు తప్ప చేస్తున్నదేమీ లేదు. అసలు ఇలాంటి వినతి పత్రం ఇచ్చినందుకు ఆ పార్టీ నేతలను రాజ్యాంగబద్ధమైన పదవుల నుంచి తప్పించాలి' అని విజయశాంతి డిమాండ్ చేశారు.

కేసీఆర్ సర్కారుకు విజయశాంతి హెచ్చరిక

కేసీఆర్ సర్కారుకు విజయశాంతి హెచ్చరిక

'అక్రమంగా గోవుల రవాణాను నిరోధించి, గోవధ జరగకుండా అడ్డుకుని రక్షించడానికి రాజ్యాంగంలోని జంతు సంరక్షణ చట్టాల ప్రకారం సుప్రీంకోర్టు వివిధ సందర్భాలలో పలు తీర్పులు ఇచ్చింది. అత్యున్నత న్యాయస్థానం తీర్పులను అనుసరించడం మాట అటుంచితే, రాష్ట్రంలో గోవుల అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతోంది. చట్టాలకు అనుగుణంగా గోవులను రక్షిస్తున్నవారిపైన తెలంగాణలో దాడులు జరుగుతున్నాయి. ఈ పరిణామాలపై తగిన చర్యలు తీసుకుని గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత పూర్తిగా సర్కారుదే. కాదంటే, హిందూ సమాజపు ఆగ్రహానికి ప్రభుత్వం గురికాక తప్పదు' అంటూ విజయశాంతి హెచ్చరించారు.

కేసీఆర్ అహంకారాన్ని దించుతారంటూ జితేందర్ రెడ్డి

కేసీఆర్ అహంకారాన్ని దించుతారంటూ జితేందర్ రెడ్డి


మరో బీజేపీ నేత జితేందర్ రెడ్డి కూడా సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. గురువారం కమలాపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జితేందర్ రెడ్డి మాట్లాడారు. హుజురాబాద్ ఉపఎన్నికలు ప్రజల ఆత్మగౌరవానికి-కేసీఆర్ అహంకారానికి మధ్య పోరుగా మారుతుందని.. ప్రజలు కేసీఆర్ అహంకారాన్ని దించుతారని అన్నారు. కేసీఆర్‌వి బూటకపు మాటలేనని విమర్శించారు.

Recommended Video

    Blockbuster Mechanic Alludu చిత్ర విశేషాలు.. ఫస్ట్ వీక్ లోనే సాలిడ్ కలెక్షన్స్ || Oneindia Telugu
    ఈటలను అందుకే బయటికి పంపారు..

    ఈటలను అందుకే బయటికి పంపారు..


    ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని, నిరంతరం తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులందరినీ కేసీఆర్ తన స్వలాభం కోసం బయటకు పంపుతున్నారని జితేందర్ రెడ్డి ఆరోపించారు. అలా బయటికి వచ్చినవారిలో తాను కూడా ఒకరినని అన్నారు. దాదాపు 20 మంది ఉద్యమకారులను పార్టీ నుంచి పంపించారని తెలిపారు. ఈటెల రాజేందర్ ఎక్కడ తన కొడుకు పదవికి అడ్డుగా ఉంటాడో అని బూటకపు భూకబ్జా ఆరోపణలు మోపి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాడని మండిపడ్డారు. అసలు అసైన్డ్ భూములు ఎక్కడ కబ్జా జరిగిందో కేసీఆర్ చూపించాలని జితేందర్ రెడ్డి ప్రశ్నించారు. బీద ప్రజలు గానీ, మంత్రి గానీ అప్లికేషన్ ఇస్తే కేసీఆర్ తీసుకుంటాడా? అని నిలదీశారు. ఎన్నికలు ఎక్కడుంటే అక్కడే సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. తెలంగాణ రాష్ట్రం 4లక్షల 25వేల కోట్ల రూపాయల అప్పుల్లో ఉందన్న జితేందర్ రెడ్డి.. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు కోసమే లక్ష కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. 3 లక్షల 25 వేల కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు అని చెప్పి ప్రజల మీద అప్పుల భారం మోపారని మండిపడ్డారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+