ప్రకాశం బ్యారేజీకి రిపేర్లు: భారీ వర్షంలోనూ..!!
Vijayawada floods 2024: వారం రోజుల కిందట సంభవించిన భారీ వర్షాలు, వరదల వల్ల రెండు తెలుగు రాష్ట్రాలను అల్లకల్లోలానికి గురయ్యాయి. దారుణంగా దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాలు నీట మునిగాయి. పల్లెలు, పట్టణాలు అనే తేడా ఉండట్లేదు. నదులు, చెరువులు ఏకం అయ్యాయి. జనావాసాలన్నీ జలమయం అయ్యాయి.
ప్రత్యేకించి- రాజధాని అమరావతి ప్రాంతం మొత్తం నీట మునిగింది. విజయవాడలో ఇదే పరిస్థితి నెలకొంది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో వరద ఉధృతి నెలకొంది. వేలాదిమందిని ముంపు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రదేశాలకు తరలించారు అధికారులు.

భారీ వర్షాలు, వరదల బారి నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది విజయవాడ. అనేక ప్రాంతాల్లో వరద నీరు తొలగిపోయింది. అయినప్పటికీ- నీట మునిగిన సింగ్ నగర్, ఆంధ్రప్రభ కాలనీ, జక్కంపూడి, యనమలకుదురు, సితార సెంటర్, వాంబే కాలనీ, కబేళా సెంటర్, చిట్టినగర్, రాజరాజేశ్వరి పేట.. వంటి చోట్ల కొత్త ఇబ్బందులు తలెత్తాయి.
ఆయా కాలనీలన్నీ బురదమయం అయ్యాయి. దాదాపు అన్ని ఇళ్లల్లో బురద పేరుకుపోయింది. నివాసాలన్నీ బురదకొట్టుకుపోయాయి. వాటిని శుభ్రం చేసుకోలేక బాధితులు సతమతమౌతున్నారు. గృహోపకరణాలన్నీ కూడా ఎందుకు ఉపయోగపడని విధంగా మారాయి.

విజయవాడ వరద ముంపునకు ప్రధాన కారణం బుడమేరు. దీనికి మూడు చోట్ల గండ్లు పడ్డాయి. మరో 16 చోట్ల చిన్న గండ్లు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఆయా గండ్లను అధికారులు పూడ్చివేశారు. అయిదు రోజులుగా నిరంతరాయంగా ఈ గండ్ల పూడ్చివేత పనులు కొనసాగాయి.
ఇదిలావుండగా.. వరద ప్రవాహం ధాటికి భారీ ఫిషింగ్ బోట్లు కొట్టుకుని వచ్చి ఢీ కొట్టిన ఘటనలో దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజీ గేట్ల మరమ్మతు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. వరదల వల్ల కొట్టుకుపోయిన గేట్ల కౌంటర్ వెయిట్ కాలమ్స్‌ను కొత్తగా నిర్మిస్తోన్నారు. ఇనుప కాలమ్‌ను ఏర్పాటు చేస్తోన్నారు. క్రేన్ల సహాయంతో వాటి పనులు చేపట్టారు.












Click it and Unblock the Notifications