కల్తీ మద్యం దుర్ఘటన: బార్‌లోనే కల్తీ, మోతాదుకు మించి మిథైనల్
విజయవాడ: విజయవాడ కల్తీ మద్యం ఘటనపై విచారణ నివేదిక సిద్ధమైంది. విజయవాడలోని స్వర్ణ బార్‌లోనే మద్యం కల్తీ జరిగినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటనపై విచారణ నివేదికను కమిషనర్ మీనా స్వయంగా గురువారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి సమర్పించనున్నారు.
బార్‌లోనే మోతాదుకు మంచి మించి మిథైనల్ కలిపినట్లు ఆబ్కారీ అధికారులు చెబుతున్నారు. దీన్ని ఆధారాలతో నిరూపించేందుకు అధికారులు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటన నేపథ్యంలో ఆబ్కారీ సూపరింటిండెంట్ రమణ సెలవుపై వెళ్లగా, సిఐని సస్పెండ్ చేశారు.
స్వర్ణ బార్ దుర్ఘటన నేపథ్యంలో 13 మిథైనల్ యూనిటల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. కాగా, పోలీసులు కాంగ్రెసు నేత మల్లాది విష్ణు బంధువుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కల్తీ మద్యం సేవించి ఐదుగురు మరణించిన విషయం తెలిసిందే.

కాగా, కల్తీ మద్యం ఘటన నేపథ్యంలో ఆబ్కారీ మంత్రి కొల్లు రవీంద్రను పదవి నుంచి తప్పించాలని సిపిఐ నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కల్తీ మద్యాన్ని వ్యతిరేకిస్తూ గురువారం విజయవాడలోని ఆబ్కారీ కార్యాలయాన్ని సిపిఐ నేతలు ముట్టడించారు.
కల్తీ మద్యం ఘటనకు పూర్తిగా ప్రభుత్వానిదే బాధ్యత అని వారన్నారు. స్వర్ణ బార్‌లో కల్తీ మద్యం సేవించి మరణించినవారి కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలేసి ఎక్స్‌గేషియా ఇవ్వాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications