ఇంద్రకీలాద్రి(విజయవాడ) దుర్గమ్మ ఆలయం మూసివేత

రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా విజయవాడ కనక దుర్గమ్మ ఆలయాన్ని ఈ నెల 28 సాయంత్రం 6.30 గంటలకు కవాట బంధనం చేస్తున్నట్లు (ఆలయ తలుపులు మూసివేత) ఈవో భ్రమరాంబ తెలిపారు. తిరి 29 వ తేదీ తెల్లవారుజామున 3.00 గంటలకు అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ప్రధాన ఆలయంతోపాటు ఉపాలయాలకు కవాట ఉద్ఘటన (ఆలయ తలుపులు తెరవడం) కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారని ఆమె వెల్లడించారు.

కవాట ఉద్ఘటన అయిన తర్వాత స్నపనాభిషేకం అలంకరణ, హారతి అనంతరం ఉదయం 9.00 గంటలకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారని, 29వ తేదీ ఉదయం నిర్వహించే సుప్రభాత సేవ, వస్త్రసేవ, ఖడ్గమాలార్చన నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 9.00 గంటల నుంచి జరిగే ఇతర ఆర్జిత సేవలు యథాతథంగా నిర్వహిస్తామని, భక్తులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. దూరం నుంచి వచ్చే వాళ్లు అందుకు తగినట్లుగా ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకొని రావాలని సూచించారు.

vijayawada indra keeladri kanakadurga tmeple will colse on october 28th

విజయవాడ అమ్మవారి ఆలయంతోపాటు తిరుమల శ్రీవారి ఆలయాన్ని కూడా ఈ నెల 28వతేదీ రాత్రి నుంచి 29 ఉదయం వరకు మూసివేయనున్నారు. ఆలయ శుద్ధి తర్వాత పూజలు నిర్వహిస్తారు. అనంతరం స్వామివారి దర్శనానికి భక్తుల్ని అనుమతించనున్నారు. చంద్రగ్రహణం కారణంగా ప్రధాన ఆలయాలతో పాటుగా అన్ని గుడులు మూతపడనున్నాయి. తిరుమల, విజయవాడతోపాటు సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, పెనుగంచిప్రోలు, పిఠాపురం.. తదితర ప్రాంతాల్లోని ప్రధాన ఆలయాలన్నింటినీ మూసివేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+