విజయవాడ జంక్షన్లో టికెట్ లేని ప్రయాణికులపై డ్రైవ్-ఒక్కరోజులో 13.83 ఫైన్ వసూలు..
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోకి వచ్చే విజయవాడ డివిజన్ లో తాజాగా నిర్వహించిన మెగా టికెట్ డ్రైవ్ లో భారీగా టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారు పట్టుబడ్డారు. వారంతంలో రద్దీగా ఉండే విజయవాడ రైల్వే స్టేషన్లో నిర్వహించిన ఈ డ్రైవ్ లో టికెట్ లేకుండా భారీగా జనం ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. వీరిపై రైల్వే చట్టం కింద కేసులు నమోదు చేసి జరిమానాలు కూడా విధించారు. ఇలా ఒక్క రోజులోనే రూ.13.83 లక్షల రూపాయలు జరిమానా వసూలు చేసి రికార్డు సృష్టించారు.
దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ రవీన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 112 మంది టిక్కెట్ చెకింగ్ అధికారులతో ఈ మెగా డ్రైవ్ నిర్వహించారు. ఇందులో 1983 కేసులను నమోదు చేయడం ద్వారా ఒక్క రోజులో రూ.13.83 లక్షల జరిమానా విధించారు. విజయవాడ డివిజన్‌లోని అన్ని విభాగాల్లో బృందాలుగా ఏర్పడి మొత్తం 65 రైళ్లను తనిఖీ చేశారు. ఈ మెగా డ్రైవ్‌లో స్క్వాడ్ టీటీఈలు, స్టేషన్ సిబ్బంది, కొత్తగా రిక్రూట్ అయిన ప్రో-కమర్షియల్ క్లర్క్స్/టికెట్ కలెక్టర్ పాల్గొన్నారు. ఉదయం, మధ్యాహ్నం 12 గంటల చొప్పున రెండు స్లాట్‌లుగా సిబ్బంది తనిఖీలు నిర్వహించారు.

ఈ భారీ టికెట్ చెకింగ్ డ్రైవ్‌లో స్టేషన్లోని అన్ని ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ప్రయాణీకుల ప్రవాహాన్ని నియంత్రించడానికి డ్రైవ్ సమయంలో గుర్తించబడిన లూజ్ ఎండ్ ఎంట్రీ/ఎగ్జిట్ పాయింట్‌లు కూడా మూసేశారు. ప్రయాణీకులు ప్రయాణం లేదా ప్లాట్‌ఫారమ్ టిక్కెట్లను కొనుగోలు చేయడానికి కౌంటర్ వద్ద క్యూలో నిలబడాలని కోరారు. ప్రయాణీకులకు నిబంధనలు అతిక్రమించకుండా ఉండేందుకు, సురక్షితమైన రవాణా కోసం ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను వాడాలని అవగాహన కల్పించారు. అలాగే బరువైన సామాను తీసుకువెళ్లే ప్రయాణీకుల్ని బుకింగ్ కోసం లగేజీ కార్యాలయానికి పంపారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications