విజయవాడకు అరుదైన గుర్తింపు - గోల్డ్ టు ప్లాటినం..!!

విజయవాడకు రైల్వే స్టేషన్ కు అరుదైన గుర్తింపు దక్కింది. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ద్వారా గ్రీన్ రైల్వే స్టేషన్‌గా అత్యున్నత "ప్లాటినం రేటింగ్" సర్టిఫికేషన్‌ను పొందింది. ఈ రేటింగ్ ద్వారా గ్రీన్ రైల్వే స్టేషన్‌లకు సంబందించిన అత్యున్నత రేటింగ్‌ విజయవాడ రైల్వే స్టేషన్‌కు లభించినట్లయింది. విజయవాడ రైల్వే స్టేషన్ ఐజీబీసీ నుండి గోల్డ్ రేటింగ్‌ను కలిగి ఉంది. ఇప్పుడు ప్లాటినం సర్టిఫికేషన్ యొక్క అత్యున్నత ప్రమాణాన్ని సాధించింది.

బెజవాడ ఏ1 స్టేషన్‌ సత్తా చాటి దేశస్థాయిలోనే అత్యుత్తమ ప్లాటినం రేటింగ్‌ సాధించింది. గోల్డ్‌ రేటింగ్‌ నుంచి ప్లాటినంకు ఎగబాకి దేశంలో అగ్రస్టేషన్ల సరసన నిలిచింది. దక్షిణ మధ్య రైల్వేలో ప్రతిసారి ప్లాటినం రేటింగ్‌ సాధిస్తున్న సికింద్రాబాద్‌తో పోటీపడుతూ ఈసారి ఎనర్జీ ఎఫిషియన్సీ-గ్రీన్‌ ఇనిషేటియేటివ్స్‌లో భాగంగా ప్లాటినం అవార్డును సాధించింది. ప్రతి మూడేళ్లకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ (ఐజీబీసీ) అవార్డులను 2023లో సెప్టెంబరు 5వ తేదీన ప్రకటించారు. ఉత్తమమైన ప్లాటినంగ్‌ రేటింగ్‌ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించాయి.

Vijayawada Railway Station bags coveted IGBC- Platinum Rating for its eco-friendly services

కేంద్ర పర్యావరణ డైరెక్టరేట్‌ పర్యవేక్షణలో ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ (ఐజీబీసీ) ద్వారా దేశ వ్యాప్తంగా గ్రీన్‌ రైల్వేస్టేషన్లను ప్రోత్సహించేందుకు, అలాంటి విధానాలను ఆవలంబించేందుకు ఈ అవార్డులను తీసుకురావటం జరిగింది. మొత్తం ఆరు అంశాలలో ప్రధానంగా ఐజీబీసీ దృష్టి సారిస్తుంది. సమర్థవంతమైనస్టేషన్‌, పరిశుభ్రత, ఆరోగ్యం, ఇంధన సామర్థ్యం, వాటర్‌ ఎఫిషియన్సీ, స్మార్ట్‌ అండ్‌ గ్రీన్‌ ఇనిషియేటివ్స్‌, ఇన్నోవేషన్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ అంశాలపై ఐజీబీసీ దృష్టి సారిస్తుంది. ఈ ఆరు ఆంశాల్లోనూ విజయవాడ స్టేషన్‌ నూరుశాతం మెరుగైన ఫలితాలను సాధించి ప్లాటినం అవార్డుకు ఎంపికైంది.

రైల్వేస్టేషన్‌కు అత్యంత సమీపంలో బస్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ సదుపాయాలు ఉండటం, మెకనైజ్డ్‌ క్లీనింగ్‌, ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవటం, స్మార్ట్‌ అండ్‌ గ్రీన్‌ ఇనిషియేటివ్స్‌లో భాగంగా వైఫై సదుపాయం, స్మార్ట్‌ కార్డ్‌ టికెటింగ్‌, ఆటోమేటిక్‌ టికెట్‌ వెండింగ్‌ మెచీన్స్‌ (ఏటీవీఎం), ఫుడ్‌ కోర్డు, ఫార్మసీ, సీసీటీవీలు, వంటివి ఏర్పాటు చేయటం కూడా రేటింగ్‌కు దోహదపడింది. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ విజయవాడ స్టేషన్ కు ఐజిబిసి నుండి అత్యధిక గ్రీన్ సర్టిఫికేట్ సాధించినందుకు విజయవాడ డివిజన్ అధికారులను అభినందించారు. హరితహారం కోసం స్టేషన్లో తీసుకుంటున్న చర్యలను తెలుసుకుని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ తరహా సర్టిఫికేషన్లు ఉద్యోగుల్లో మనోధైర్యాన్ని, విశ్వాసాన్ని పెంపొందిస్తాయని, మరింత ముందుకు సాగేందుకు దోహదం చేస్తాయన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+