వియ్యంకులవుతున్న టీడీపీ నేతలు: ఆళ్లగడ్డ టు బెజవాడ : ఆ ఇద్దరూ పార్టీ యువ నేతలే..!!
టీడీపీలో మరో ఇద్దరు నేతలు వియ్యంకులు కాబోతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు బంధుత్వం కలుపుకున్నారు. రాజకీయ - వ్యాపార రంగాల్లో ఉన్న వారు తమకు తాముగా బంధుత్వాలు కలుపుకోవటంలో ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు అదే విధంగా మరో ఇద్దరు కీలక నేతలు వియ్యంకులు అయ్యేందుకు అంతా సెట్ అయింది. టీడీపీ బెజవాడ ఫైర్ బ్రాండ్..పోలిట్ బ్యూరో సభ్యుుడిగా ఉన్న బోండా ఉమా ... నంద్యాల టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి వియ్యంకులుగా మారబోతున్నారు. బోండా ఉమా కుమరుడు సిద్దార్ధ్..ఏవీ సుబ్బారెడ్డి కుమార్తె ఏవీ జస్విత రెడ్డిని పెళ్లి చేసుకోనున్నారు.

నిశ్చితార్ద ముహూర్తం ఫిక్స్
ఈ మేరకు రెండు కుటుంబాల మధ్య నిర్ణయం జరిగింది. మార్చి 27న వీరి వివాహ నిశ్చితార్ధం కోసం ముహూర్తం ఫిక్స్ అయింది. హైదరాబాద్ లోని ఫలక్ నుమా ప్యాలెస్ లో వీరిద్దరికి ఎంగేజ్ మెంట్ చేసేందుకు నిర్ణయించారు. అమెరికాలో వీరిద్దరూ కలిసి చదువుకున్నారు. టీడీపీలో పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా ఉంటున్నారు. ప్రధానంగా ఎన్నారై టీడీపీ విభాగంతో ఈ ఇద్దరిదీ కీ రోల్ గా ఉంది.
ఇప్పటికే టీడీపీలో మాజీ మంత్రులు గంటా శ్రీనివాస రావు.. పీ నారాయణ వియ్యంకులుగా ఉన్నారు. అదే విధంగా భీమవరం టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామాంజనేయులు సైతం గంటాకు వియ్యంకులు. టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు - కొమ్మాలపాటి శ్రీధర్ సైతం వియ్యంకులు.

టీడీపీలోనే ఇదే బాటలో గతంలోనూ..
శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన నాయుడు - విశాఖకు చెందిన టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తి కుమార్తును చేసుకున్నారు. అదే విధంగా రామ్మోహన్ నాయుడు సోదరి ప్రస్తుత రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని మామగారు సైతం టీడీపీ నేతగా ఉన్నారు. ఇలా.. ఇంకా చాలా మంది నేతలు పార్టీలకు అతీతంగా బంధుత్వాలు వివాహాలతో కలుపుకున్న వారి లిస్టు చాలానే ఉంది. ఇక, ప్రస్తుతం బోండా ఉమా టీడీపీలో కీలక నేతగా మారారు. అదే విధంగా నంద్యాల టీడీపీలో ఏవీ సుబ్బారెడ్డి కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన తొలి నుంచి భూమా నాగిరెడ్డికి కుడి భుజంగా వ్యవహరించారు.
Recommended Video

ఆళ్లగడ్డ టు బెజవాడ వయా యూఎస్ఏ
భూమా నాగిరెడ్డి మరణం తరువాత ఆ కుటుంబంతోనే ఉన్నారు. ఈ మధ్య కాలంలో విభేదాలు బయటకు వచ్చాయి. నంద్యాల ఉప ఎన్నిక సమయంలో ఆయన అభ్యర్దిగా టీడీపీ నుంచి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. కానీ, ఆ సమయంలో నామినేటెడ్ పదవి ఇచ్చేలా హామీ దక్కింది.
ఫలితంగా ఏపీ సీడ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ గా నియమించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన నంద్యాల - ఆళ్లగడ్డ కేంద్రంగా రాజకీయాలు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఆళ్లగడ్డ కు చెందిన టీడీపీ నేత కుమార్తె... బెజవాడకు చెందిన టీడీపీ నేత కుమారుడితో వివాహం జరగనుంది. ఇప్పుడు ఈ వార్త టీడీపీలో ఆసక్త కర చర్చకు కారణ మవుతోంది.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!!












Click it and Unblock the Notifications