ఏపీలో జగన్, తమిళనాడులో విజయ్.. సేమ్ టూ సేమ్..!

తమిళనాడులో హీరో విజయ్ కొత్త రాజకీయ పార్టీ స్థాపించిన సంగతి తెలిసిందే. తమిళ వెట్రి కజగం అనే పేరిటతో హీరో విజయ్ తమిళనాడులో రాజకీయ పార్టీ స్థాపించారు. గతంలో తన పార్టీకి సంబంధించిన జెండా అవిష్కరించారాయన. తాజాగా తన తొలి రాజకీయ సభను ఏర్పాటు చేశారు. ఈ సభ ద్వారా తన పార్టీ విధి విధానాలను విజయ్ వెల్లడించారు. ఈ సందర్భంగా విజయ్ తన రాజకీయ ఎంట్రీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు అనేవి పాము లాంటివని అన్నారు. తన పార్టీలో అందరికి సముచిత స్థానం లభిస్తోందని, పార్టీలో తనకు అందరు సమానమేనని ఆయన తెలిపారు. తాను రాజకీయాల్లో చిన్నపిల్లాడినే కావొచ్చు కానీ ఎవరికీ భయపడేది లేదన్నారు.

ఆయన కూడా డీఎంకే బాటలో పయనిస్తాననే సంకేతం ఇచ్చారు. రాష్ట్రంలో ఒకటే కులం.. ఒకరే దేవుడు అనేదే తన విధానమని విజయ్ ప్రకటించారు. తమిళనాడులో ఒక్క బీజేపీ మినహా అన్నీ ఒకే తరహా పార్టీలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ, ఎవరి విధానం వారికి ఉందని విజయ్ తెలిపారు. సినిమాల కంటే రాజకీయాలపైనే తాను ఎక్కువ దృష్టి పెడతానని చెప్పారు. విజయ్ తొలి రాజకీయ సభకు అభిమానులు భారీగా హాజరయ్యారు. ఈ సభకు దాదాపు 7 లక్షల మంది హాజరయ్యారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే విజయ్ రాజకీయ సభకు సంబంధించిన వీడియోలతో వైసీపీ సోషల్ మీడియా హోరెత్తిస్తోంది.

Vijays Jagan-Inspired Walk YSRCP Social Media Bursts with Pro-Jagan Messages

జగన్ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్ధం పేరిట సభలను నిర్వహించారు. ఈ సభల్లో జగన్ అభిమానులకు అభివాదం చేయడానికి వీలుగా ర్యాంప్ వాక్‌ను ఏర్పాటు చేశారు. ఈ ర్యాంప్ వాక్ ద్వారా సభకు వచ్చిన అభిమానులకు జగన్ అభివాదం చేసుకుంటూ ముందుకు కదిలారు. జగన్ తన ప్రతి సభలోనూ ఇదే విధంగా ర్యాంప్ వాక్ చేయడం జరిగింది. ఇప్పుడు విజయ్ పెట్టిన రాజకీయ సభలో కూడా జగన్ మాదిరిగానే ర్యాంప్ వాక్ చేసే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ ర్యాంపు వ్యాక్ ద్వారా అభిమానులకు అభివాదం చేశారు విజయ్. దీంతో జగన్‌ను విజయ్ ఫాలో అవుతున్నారంటూ వైసీపీ శ్రేణులు కామెంట్స్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలను సైతం తమ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇక విజయ్ తన తొలి రాజకీయ సభతోనే ప్రధాన పార్టీలకు తాను కూడా బలమైన పోటీ దారుడినేనని సంకేతం ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+