పెద్దల కట్టడి: ఆమెతో మాట్లాడితే రూ.3 వేలు జరిమానా

చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని తవణంపల్లె మండలంలో ఓ దళిత మహిళకు సాంఘిక బహిష్కర విధిస్తూ తీర్మానం చేశారు. ఆమెకు గ్రామంలో సహాయ నిరాకరణ చేయాలని వారు కట్టడి చేశారు. తవణంపల్లె మండలంలోని గోవిందరెడ్డిపల్లె దళితవాడలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

బాధితురాలి ఫిర్యాదు మేరకు 15 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మీడియాలో వచ్చిన కథనం మేరకు - గోవిందరెడ్డిపల్లె దళితవాడకు చెందిన పుష్ప అదే గ్రామంలో 2014లో రోడ్డుకు ఆనుకుని ఉన్న 13 సెంట్ల స్థలం కొనుగోలు చేసింది. ఐ స్థలానికి ఆనుకుని 2007లో పంచాయతీ అధికారులు పశువుల దాహం తీర్చడానికి నీటి తొట్టె కట్టారు.

Village elders orders not speak with dalit girl

అప్పటి నుంచి గ్రామస్తులు కొందరు ఆ నీటి తొట్టె దగ్గర దుస్తులు ఉతకడం ప్రారంభిచారు. నీటి తొట్టె సమీపంలోని తన స్థలంలో ఇల్లు కట్టుకోవాలని ఆ దళిత మహిళ ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే, అక్కడ దుస్తులు ఉతకడంతో మురికి నీరంతా తన స్తలంలోకి వస్తోందని, ఇక్కడ ఉతకవద్దని చాలాసార్లు మొర పెట్టుకుంది.

అయినా వారు వినకపోవడంతో దళితవాడ ప్రజలకు, ఆమెకు మధ్య గొడవ ప్రారంభమైంది. గత మేనెలలో దళిత వాడలోని ప్రజలంతా మాట్లాడుకుని ఆమెకు సహాయ నిరాకరథ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆమెతో ఎవరూ మాట్లాడరాదని, మాట్లాడితే రూ.3 వేలు జరిమానా వేస్తామని కట్టడి చేశారు. ఈ విషయంపై బాధితురాలు పుష్ప ఈ నెల 8వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+