ప్రపంచ గుర్తింపు: ఎంపీ గల్లా, నోటిఫికేషన్ జారీ

గుంటూరు: ఆంధ్రప్రదేస్ ప్రతిపాదిత రాజధాని ప్రాంతం గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం నేలపాడులో భూ సమీకరణకు అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. గ్రామంలోని 1,409.25 ఎకరాల భూ సేకరణకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.

పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.

Villagers put a rider on parting with land for A.P. capital

ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి పంచాయితీ కార్యాలయంలో రైతుల నుంచి సమ్మతి పత్రాలు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇక ఏపీ కొత్త రాజధానికి 15వేల ఎకరాలు సరిపోతుందనే వాదన సరైదనదికాదని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు.

రాజధాని అంటే కేవలం ప్రభుత్వ భవనాలు ఒక్కటే కాదని, ప్రజాజీవనం మెరుగుదల, ప్రజలతో మమేకమే రాజధాని అభివృద్ధి అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రపంచ స్ధాయి గుర్తింపు పొందేలా ఉంటుందని స్పష్టం చేశారు.

భూ సమీకరణకు నేలపాడు రైతుల సంపూర్ణ మద్దతు

ఏపీ నూతన రాజధాని నిర్మాణం కోసం సీఎం చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన భూ సమీకరణకు రైతుల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. శుక్రవారం ఉదయం తుళ్లూరు మండలం నేలపాడు గ్రామంలో చేపట్టిన భూ సమీకరణకు గ్రామంలోని రైతులు సంపూర్ణ మద్దతును ప్రకటించారు.

రాజధాని నిర్మాణం కోసం తమ భూములను అప్పగించేందుకు వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఈ సందర్భంగా గ్రామంలో పర్యటించిన మంత్రి నారాయణ రైతులను అభినందించారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చేందుకు ముందుకొచ్చిన రైతులకు భవిష్యత్తులో అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆయన ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+