ఎమ్మెల్యే వస్తే అన్ని ఇళ్ళకూ తాళాలే; అవమానిస్తారా అంటూ వైసీపీ ఎమ్మెల్యే వార్నింగ్!!
చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబుకు నియోజకవర్గంలోని ఒక ఊరి జనం షాకిచ్చారు. ఎవరైనా ఎమ్మెల్యే తీరుపై నిరసన తెలియజేయాలంటే ఎమ్మెల్యేను గట్టిగా నిలదీయడమో, ఆందోళన చేయడమో చేస్తారు. కానీ అలాంటివేవీ లేకుండా పూతలపట్టు మండలం పేట అగ్రహారం గ్రామంలో గ్రామస్తులు వైసీపీ ఎమ్మెల్యే కు షాక్ ఇచ్చారు.
గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో గ్రామంలో ఎమ్మెల్యే పర్యటనకు వస్తున్నారని తెలిసినవారు ఎమ్మెల్యే పర్యటన ను బహిష్కరించారు. ఇళ్లకు తాళాలు వేసి గ్రామాన్ని విడిచి వెళ్లిపోయారు. పేట అగ్రహారం పంచాయతీలోని అంబేద్కర్ కాలనీ వాసులు మినహా గ్రామమంతా ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోవడం ఎమ్మెల్యే కు షాక్ ఇచ్చింది. ఎమ్మెల్యే ఉన్నంతసేపు గ్రామంలోకి అడుగుపెట్టేది లేదని నిర్ణయం తీసుకున్న గ్రామస్తులు, ఆ మేరకు ఆయన ఊర్లో ఉన్నంతసేపు గ్రామంలోకి అడుగుపెట్టలేదు.

ఇక గ్రామానికి పర్యటన నిమిత్తం వచ్చిన ఎమ్మెల్యే గ్రామంలోని ఇళ్లకు తాళం వేసి ఉండటాన్ని చూసి ఖంగు తిన్నారు. కేవలం ఎస్సీ కాలనీలో మాత్రమే పర్యటించిన ఆయన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తీసుకుంటూ, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాన్ని బహిష్కరించడాన్ని తప్పుబట్టారు. ఎమ్మెల్యే ఇంటికి వస్తే తాళం వేసి వెళ్ళినవారు లబ్ధి ఎలా పొందుతారో చెప్పాలని ఆయన మండిపడ్డారు.
తనను అవమానించిన గ్రామస్తులకు 100% పథకాలు రాకుండా చేస్తానని వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు ఇప్పటి వరకు తీసుకున్న పథకాలను కూడా తిరిగి ఇవ్వాలంటూ ఎమ్మెల్యే ఎం ఎస్ బాబు అసహనం వ్యక్తం చేశారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించి గ్రామాల్లోకి వస్తే తనను అవమానించారని ఎమ్మెల్యే మండిపడ్డారు. అయితే గ్రామస్తులు ఇళ్లకు తాళాలు వేసి వినూత్నంగా నిరసన తెలియ చేసిన తీరు మొదట చర్చనీయాంశం అయ్యింది.
ఆపై ఎమ్మెల్యే గ్రామస్తులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ప్రస్తుతం చిత్తూరు జిల్లా లో చర్చనీయాంశంగా మారాయి. ఎమ్మెల్యే అయి ఉండి ప్రజల పైన ఈ విధంగా నోటికొచ్చినట్టు మాట్లాడతారా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలతో ఇస్తున్న డబ్బులు ఎమ్మెల్యే ఇంట్లో నుంచి ఏమైనా ఇస్తున్నారా.. అవి ప్రజల డబ్బులే కదా అంటూ నిలదీస్తున్నారు. మాటలు జాగ్రత్తగా మాట్లాడకపోతే వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications