ఉత్తరాంధ్రలో వైసీపీకి బిగ్ షాక్- మరో నేత అవుట్

Adari Anand Kumar: ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. అనేక జిల్లాల్లో ఆ పార్టీని ఖాళీ అవుతోంది. బడా నాయకులు సైతం గుడ్‌బై చెబుతున్నారు. మాజీ మంత్రులు-ఎంపీలు- ఎమ్మెల్యేలు- ఎమ్మెల్సీలు వరుస కట్టి బయటికెళ్తోన్నారు.

ఎన్నికల ఫలితాలు వెలువడిన తొలి రోజుల్లోనే వైఎస్ఆర్సీపీ మాజీ శాసన సభ్యుడు పెండెం దొరబాబు పార్టీకి గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. దాదాపుగా ఆయనతో ఆరంభమైన రాజీనామాల పర్వం ఇప్పటికీ కొనసాగుతోంది. తరువాత మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, ఎమ్మెల్సీలు పోతుల సునీత, కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ తమ పదవులకు రాజీనామా చేశారు.

Visakha Dairy Chairman Adari Anand Kumar quits YSRCP

అంతకుముందు రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్‌రావు, మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్య వైసీపీని వీడారు. టీడీపీలో చేరారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్సీపీకి పెద్ద దిక్కుగా ఉంటూ వచ్చిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన మాజీ విప్ సామినేని ఉదయభాను, గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య.. భారీ షాక్ ఇచ్చారు.

ఈ మధ్యే- మాజీ అవంతి శ్రీనివాస్, భీమవరానికి చెందిన మాజీ శాసన సభ్యుడు గ్రంధి శ్రీనివాస్ కూడా అదే బాట పట్టారు. వీరిద్దరు కూడా తెలుగుదేశం పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటోన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సమక్షంలో పార్టీ కండువా కప్పుకొంటారని తెలుస్తోంది.

ఇప్పుడు తాజాగా ఉత్తరాంధ్రకు చెందిన మరో నాయకుడు అడారి ఆనంద్ కుమార్.. వైసీపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పంపించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ గుడ్‌బై చెప్పారాయన. విశాఖ వెస్ట్ నియోజకవర్గం ఇన్‌ఛార్జ్, విశాఖ డెయిరీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తోన్నారు.

ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో విశాఖ వెస్ట్ నుంచి పోటీ చేశారు అడారి ఆనంద్ కుమార్. తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీకి చెందిన పీజీవీఆర్ నాయుడు (గణబాబు) చేతిలో 35 వేలకు పైగా ఓట్ల తేడాతో పరాజయాన్ని చవి చూశారు. అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాల్లో పెద్దగా పాల్గొనట్లేదు.

తాజాగా పార్టీకి, విశాఖ డెయిరీ ఛైర్మన్ పదవికీ రాజీనామా చేశారు. ఆయనతో పాటు 12 మంది డైరెక్టర్లు కూడా రాజీనామా చేసినట్లు సమాచారం. వీళ్లంతా తెలుగుదేశం పార్టీలో చేరవచ్చని చెబుతున్నారు. ఫలితంగా విశాఖ డెయిరీ ఛైర్మన్ పదవి టీడీపీ ఖాతాలో పడుతుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+